Begin typing your search above and press return to search.
బండ్ల ఎవరికి బినామీ.. బయటపెట్టేశాడు..
By: Tupaki Desk | 23 Nov 2018 5:43 AM GMTబండ్ల గణేష్.. ఓ మామూలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి బడా నిర్మాతగా ఎదిగారు. స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ లాంటి 100 కోట్ల సినిమా తీశాడు. భారీ కలెక్షన్లు సాధించారు. ఇంతకీ అంత తక్కువ టైంలో అంత ఎక్కువ స్థాయికి బండ్ల ఎలా ఎదిగారు? ఆ చిక్కుముడి విప్పేదెవరు.? బండ్ల ప్రయాణంపై ఎన్నో అనుమానాలున్న నేపథ్యంలో తాజాగా ఓ చానెల్ లో బండ్ల బినామీ, ఆస్తులపై ఆసక్తికర చర్చ జరిగింది..
ఈ సందర్భంగా సదురు జర్నలిస్టు బండ్ల గణేష్.. రాజకీయ నాయకుడు బొత్స బినామా.? అని ప్రశ్నించారు. బొత్సకే ఆస్తులు లేవని.. ఆయన బినామీగా నన్ను అభివర్ణించడం ఏంటని బండ్ల ఎదురు ప్రశ్నించారు. ఆయనతో తనకు సంబంధం లేదని.. బొత్సను అన్నయ్య అని పిలుస్తానని.. సన్నిహిత సంబంధాలున్నామాట వాస్తవమే అయినా.. ఆర్థిక విషయాలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. బొత్సకు బినామీ అన్నది శుద్ధ అబద్దమని వివరణ ఇచ్చారు.
ఇక బండ్ల గణేష్ ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు రెడీ అయిన నేపథ్యంలో అసలు మీ ఆస్తులెంత అని బండ్ల గణేష్ కు ప్రశ్న ఎదురైంది.? దీనికి కూడా దాటవేసేలా బండ్ల సమాధానం ఇచ్చారు. మా ఫ్యామిలీకి 200 కోట్ల ఆస్తులున్నాయని.. మేమింకా ఆస్తులు పంచుకోలేదని వివరణ ఇచ్చారు. తన సొంత ఆస్తులు ఏమీ లేవని.. కావాలంటే తన ఆడిటర్ ను అడిగి తెలుసుకోవాలంటూ వీలుంటే నెట్లో కూడా పెట్టండి అంటూ బండ్ల సూటిగా సమాధానం ఇవ్వలేక తప్పించుకున్నారు.
ఇలా బినామీ - ఆస్తుల లెక్కను ఎక్కడా దొరక్కుండా బండ్ల గణేష్ ఆ దిగ్గజ జర్నలిస్టు ప్రశ్నలకు చాకచక్యంగా సమాధానాలిస్తూ తప్పించుకున్నాడు. నిజమైన పొలిటీషియన్ లా మారిపోయారు. ఎంత కుదిపినా.. ప్రశ్నించినా తన గుట్టును మాత్రం బయటపెట్టకపోవడం గమనార్హం..