Begin typing your search above and press return to search.
లింగమార్పిడికి ప్రయత్నం.. తేడా రావడంతో కుటుంబాన్ని కడతేర్చాడు
By: Tupaki Desk | 6 Sep 2021 11:30 PM GMTలింగమార్పిడి సర్జరీకి డబ్బు ఇవ్వలేదని కుటుంబం మొత్తాన్ని హత్య చేశాడు యువకుడు. ఆగస్టు 23న హర్యానాలోని రోహ్ తక్ ప్రాంతానికి చెందిన అభిషేక్ మాలిక్(20) ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.
అభిషేక్ తండ్రి స్థిరాస్తి వ్యాపారంలో ఉంటాడు. ఆయన పేరు ప్రదీప్ మాలిక్. తండ్రిని లింగమార్పిడి చేయించుకునేందుకు డబ్బులు అడగ్గా ఇవ్వలేదు. దీంతో ఆవేశం పట్టలేని అభిషేక్ తండ్రితో సహా తల్లి బాబ్లీ దేవి.. బామ్మ రోష్ని దేవీతోపాటు సోదరిని సైతం తుపాకీతో కాల్చాడు. 17 ఏళ్ల అభిషేక్ సోదరి బుల్లెట్ గాయాలతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత మరణించింది. సెప్టెంబర్ 1న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అభిషేక్ స్వలింగ సంబంధాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. అతడు లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకునేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. డబ్బు ఇవ్వలేదు. కొడుకు ట్రాన్స్ జెండర్ గా మారడాన్ని ఆ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. జీర్ణించుకోలేకపోయారు. కుదరదని.. డబ్బులు ఇవ్వమని తేల్చిచెప్పారు.
దీంతో కృరమృగంలా మారిన అభిషేర్ 20 రోజులుగా వారి అడ్డు తొలగించుకోవాలని ప్రణాళిక వేస్తున్నాడు. ఇంట్లో నుంచి డబ్బు తీసుకున్న తర్వాత విదేశాలకు పారిపోవాలని స్కెచ్ వేసుకున్నాడు. తన తండ్రి స్నేహితుడు నుంచి పిస్టల్ తీసుకున్నాడు. దానికి లైసెన్స్ లేదు. దాంతో కుటుంబ సభ్యులను కాల్చిచంపాడు. ఆ తర్వాత అభిషేక్ ఇంట్లో దొంగలించిన ఆభరణాలను తీసుకొని పారిపోయాడు. పోలీసులు అభిషేక్ ను పట్టుకొని ఆభరణాలు, పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు.
అభిషేక్ క్యాబిన్ క్రూ కోర్సు చేశాడు. ఆ సమయంలో ఓ యువకుడితో అతడు సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. అదే ఈ సమస్యకు కారణమైంది. మగ స్నేహితుడి ప్రమేయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు.