Begin typing your search above and press return to search.

వీడెక్కడి తండ్రి.. కొడుకు కుటుంబాన్ని దారుణంగా చంపేశాడు

By:  Tupaki Desk   |   20 March 2022 5:30 PM GMT
వీడెక్కడి తండ్రి.. కొడుకు కుటుంబాన్ని దారుణంగా చంపేశాడు
X
ఇటీవల వెలుగు చూస్తున్న ఘోరాలు.. దారుణాలకు అంతు లేకుండా పోతోంది. తాజాగా బయటకు వచ్చిన ఈ ఉదంతం విన్నంతనే షాకింగ్ గా మారటమే కాదు.. తండ్రి అనే పదానికి ద్రోహం చేసిన ఈ ముసలోడ్ని ఏం చేయాలి? అన్న భావన కలుగక మానదు. కేవలం 50 సెంట్ల భూమి కోసం కన్న కొడుకు కుటుంబం మొత్తాన్ని తగలెట్టేసిన ఈ కిరాతకుడు తండ్రి అనే పదానికి మాయని మచ్చలా మారాడని చెప్పాలి. కేరళలో చోటు చేసుకున్న ఈ దారుణ క్రైం.. షాకింగ్ గా మారటమే కాదు.. పెను సంచలనంగా మారింది.

79 ఏళ్ల ముదిమి వయసులో కొడుకు మీద ప్రతీకారంతో రగిలిపోయిన ఒక తండ్రి చేసిన దారుణం గురించి తెలిసిన వారెవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కేరళ రాష్ట్రంలోని ఇడుక్కిలో చోటు చేసుకున్న ఈ దారుణంలోకి వెళితే.. హమీద్ అనే 79 ఏళ్ల ముసలాయనకు ఫైజల్ అనే కొడుకు ఉన్నాడు. కొన్నేళ్ల క్రితం కొడుక్కి 50సెంట్ల భూమిని రాసిచ్చాడు. తాజాగా తాను రాసిచ్చిన భూమిని తనకు తిరిగి ఇచ్చేయాలని కోరుతున్నాడు. అందుకు ఫైజల్ నో చెబుతున్నాడు.

దీంతో కొడుకు మీదా అతడి కుటుంబం మీదా తీవ్రమైన కోపాన్ని పెట్టుకున్న అతడు.. కొడుకు కుటుంబాన్ని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఇంటి పైన ఉన్న నీళ్ల ట్యాంకులో చుక్క నీళ్లు లేకుండా చేయటంతో పాటు.. బావి దగ్గర నీళ్లు తోడేందుకు వీల్లేని విధంగా బకెట్ తీసేశాడు. ఇక.. కొడుకు కుటుంబం (కొడుకు, కోడలు.. ఇద్దరు మనమరాళ్లు) ఒక గదిలో నిద్ర పోతున్న వేళలో.. వారు బయటకు రాకుండా ఉండేందుకు వీలుగా తలుపు గడియ పెట్టేశాడు.

కిటికీలో నుంచి ఐదు పెట్రోల్ బాటిళ్లను విసిరాడు.. అగ్గిపుల్ల వెలిగించాడు. మంటల తీవ్రతకు నిద్ర లేచిన వారు బయట పడేందుకు తెగ ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. మంటల తీవ్రతకు భయపడిన ఫైజల్ చిన్న కుమార్తు తండ్రిని పట్టేసుకుంది. తప్పించుకునే మార్గం లేకపోవటంతో వారంతా మంటల్లో చిక్కుకొని అగ్నికి ఆహుతి అయ్యారు.

ఈ ఉదంతం గురించి తెలిసిన స్థానికులు షాక్ తిన్నారు. ఎక్కడ వారు అక్కడే కూర్చుండిపోయిన డెడ్ బాడీల్ని చూసిన స్థానికులుకన్నీరు మున్నీరు అవుతున్నారు. కన్నతండ్రిగా ఉండే కొడుకు బతుకు కంటే కూడా తనకున్న కోపాన్ని తీర్చుకోవటానికి నలుగురిని దారుణంగా చంపేసిన తీరు సంచలనంగా మారింది. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. తన కొడుకు కుటుంబాన్ని తానే చంపేసినట్లుగా ఒప్పుకున్నాడు.