Begin typing your search above and press return to search.

కమెడియన్ దారుణ హత్య.. ఇంట్లోంచి లాక్కెళ్ళి దారుణంగా.. !

By:  Tupaki Desk   |   29 July 2021 12:30 AM GMT
కమెడియన్ దారుణ హత్య.. ఇంట్లోంచి లాక్కెళ్ళి దారుణంగా.. !
X
ప్రముఖ కమెడియన్‌ ను అత్యంత కిరాతకంగా ఇంట్లో నుండి లాకెళ్లి గొంతు కోసి చంపేసిన ఘటన ఇప్పుడు ప్రపంచాన్ని వణికిపోయేలా చేస్తుంది. ఈ ఘటన గత కొన్ని రోజులుగా తాలిబన్ల చేతుల్లో చిక్కుకొని నలిగిపోతున్న ఆఫ్గనిస్తాన్ లో చోటు చేసుకుంది. ఆ దేశంలో ప్రముఖ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నాజర్ మహమ్మద్‌ను అత్యంత దారుణంగా గొంతుకోసి చంపేసారు. ఈ ఘటన స్థానికంగానే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. తాలిబన్లే సదరు కమెడియన్‌‌ను చంపేసారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంట్లో ఉన్న సమయంలో వాళ్లు వచ్చి బలవంతంగా బయటికి లాక్కెళ్లి మరీ చంపేసారని తెలిపారు.

అఫ్ఘనిస్తాన్‌ కాందహార్‌ ప్రావిన్స్‌ లో ఖాషా జ్వాన్‌ గా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ నాజర్ మొహమ్మద్ దారుణ హత్య సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుంది. స్థానిక మీడియా కథనం ప్రకారం జులై 27 రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు నాజర్‌ ఇంట్లోకి ప్రవేశించి, గన్నులతో బెదిరించారు. అక్కడితో ఆగకుండా అతడిని బలవంతంగా బయటికి లాక్కెళ్ళారు. వద్దని వేడుకుంటున్నా కూడా వినలేదు. చొక్కా పట్టుకుని మరీ ఈడ్చుకెళ్ళారు. ఆ తర్వాత నాజర్‌ ని దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తుంది. నాజర్‌ కమెడియన్‌ కావడానికి ముందు కాందహార్‌ ప్రావిన్స్‌ లో పోలీసు అధికారిగా పని చేసారు. అక్కడే ఆయనకు శత్రువులు ఉన్నారని తెలుస్తుంది. కచ్చితంగా తాలిబన్లే ఈ దారుణానికి ఒడిగట్టారని కమెడియన్‌ కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్ మాత్రం ఈ ఘటనలో తమ ప్రమేయం లేదని ఖండించింది. కొన్ని రోజులుగా అఫ్గనిస్తాన్‌ పోలీసులపై తాలిబన్లు వరస దాడులు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 70 శాతం అఫ్గానిస్తాన్‌ ను స్వాధీనం చేసుకున్నట్లు వాళ్ళు వెల్లడించారు.

కాందహార్‌ లో పలు కుటుంబాలు యుద్ధం వల్ల దెబ్బతిన్న ప్రాంతాల నుంచి పారిపోతున్నాయి. వీరంతా అఫ్గాన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. కాందహార్‌ పార్లమెంట్‌ సభ్యుడు సయ్యద్ అహ్మద్ సైలాబ్ మాట్లాడుతూ.. ‘ఈద్ వేడుకల తరువాత, తాలిబన్లు కాందహార్‌ ప్రావిన్స్‌ లోని అఫ్ఘన్ దళాలపై దాడులను ముమ్మరం చేశారు. భద్రత కోసం పారిపోయిన ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని అని తెలిపారు. అంతేకాక కాందహార్‌ సమీపంలోని వలస శిబిరాల్లో తలదాచుకుంటున్న ప్రజలకు ఆహారం, వైద్య సంరక్షణ అందిస్తున్నామని తెలపారు.