Begin typing your search above and press return to search.
30 మంది పిల్లలపై హత్యాచారం.. సీరియల్ రేపిస్ట్ ను ఉరితీయాల్సిందే
By: Tupaki Desk | 10 May 2023 6:26 PM GMTడ్రగ్స్ కు బానిసైతే మిన్నూ మన్ను కానదంటారు. ఏం చేస్తామో కూడా తెలియదంటారు. ఇక్కడ ఒక యువకుడు కూడా అలానే మారాడు. డ్రగ్స్ కు బానిసై అశ్లీల చిత్రాలు చూడడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కామోద్రేకంతో అభం శుభం తెలియని 6-12 ఏళ్లలోపు పిల్లలను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి హత్యలకు పాల్పడ్డాడు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 30 మంది చిన్నారుల జీవితాలను చిదిమివేశాడు. ఈ కిరాతకుడిని ఎట్టకేలకు దోషిగా తేల్చింది కోర్టు.. మరో రెండు వారాల్లో అతడికి శిక్షను ఖరారు చేయనుంది.
అభం శుభం తెలియని చిన్నారులను టార్గెట్ చేయడం.. వారికి డబ్బులు, చాక్లెట్లు ఆశచూపి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లేవాడు. ఆ తర్వాత వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబుతారేమోనని దారుణంగా హత్య చేసేవాడు.ముఖ్యంగా ఆర్థికంగా అంతగా లేని గుడిసెల్లో నివసించే పేదలు,. కార్మికుల పిల్లలను కూడా ఇతడు లక్ష్యంగా చేసుకునేవాడు. రాత్రివేళ తల్లిదండ్రులు నిద్రించే సమయంలో పిల్లలను ఎత్తుకెళ్లేవాడు.
నూతనంగా నిర్మించే భవనాలు, పాడుబడ్డ భవనాలకు తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. బాధితుల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే ఉన్నారు.
2008లో 18 ఏళ్ల వయసులో రవీంద్ర కుమార్ కుటుంబం ఉత్తరప్రదేశ్ లోని కాస్ గంఝ్ నుంచి ఢిల్లీకి వలసవచ్చింది. అతడి తండ్రి ప్లంబర్. తల్లి ఇళ్లలో పనిచేసింది. ఢిల్లీ వచ్చాక కొద్దిరోజులకు రవీంద్ర డ్రగ్స్ కు బానిసయ్యాడు. ఆ తర్వాత అశ్లీల చిత్రాలు చూడడం అలవాటు చేసుకున్నాడు.
రోజు మొత్తం కూలీగా పనిచేసి 8 గంటలకే నిద్రపోయేవాడు. అర్ధరాత్రి లేచి చిన్నపిల్లలను వెతుక్కుంటూ మురికివాడలకు వెళ్లేవాడు. అలా 40 కి.మీలు నడిచిన రోజులు ఉన్నాయి. అలా వెళుతున్నప్పుడు కనిపించిన చిన్న పిల్లలను మభ్యపెట్టి నిద్రపోతున్న వారిని నిర్జన ప్రదేశాలకు తీసుకెళ్లేవాడు. తర్వాత వారిని లైంగికంగా హింసించి హతమార్చేవాడు.
ఇలా 2008-2015 మధ్య 30 మంది ఉసురు తీశాడు. మృతులంతా 6-12 ఏళ్ల వయసు వారే. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు వేర్వేరు ప్రదేశాలకు ఈ ఘోరాలకు ఎంచుకున్నాడు.
2014లో రవీంద్ర చిక్కాడు. ఓ ఆరేళ్ల పాపను ఇదే విధంగా చంపేసి సెప్టిక్ ట్యాంకులో విసిరేశాడని రవీంద్రపై కేసు నమోదైంది. దానిపై విచారణ జరిపిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి నిఘా పెంచారు. ఆధారాలు లభించడంతో రవీంద్రను అరెస్ట్ చేశారు. విచారణలో ఈ దారుణాలు వెలుగుచూశాయి. కోర్టు దోషిగా తేల్చింది. రెండు వారాల్లో శిక్షను ఖరారు చేయనుంది. ఈ మానవ మృగానికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు.