Begin typing your search above and press return to search.

ఏవీ సుబ్బారెడ్డి హత్యకు భారీ ప్లాన్.. పోలీసుల భగ్నం

By:  Tupaki Desk   |   22 March 2020 7:10 AM GMT
ఏవీ సుబ్బారెడ్డి హత్యకు భారీ ప్లాన్.. పోలీసుల భగ్నం
X
రాజకీయ హత్య అమలు కాకుండా అడ్డుకున్నారు కర్నూలు జిల్లా పోలీసులు. ఫ్యాక్షన్ కల్చర్ తో పాటు.. రాజకీయాల్లో తమ ప్రత్యర్థుల్ని మట్టు పెట్టే విషయంలో కర్నూలు జిల్లాది ప్రత్యేకమైన స్థానం ఉంది. టార్గెట్ చేస్తే చాలు.. వారిని కడతేర్చే వరకూ వెనక్కి తగ్గని తీరు అక్కడ కనిపిస్తుంది. తాజాగా ఆళ్లగడ్డ టీడీపీ నేత.. రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి హత్యను కడప పోలీసులు భగ్నం చేశారు. సంచలనంగా మారిన ఈ ఉదంతానికి సంబంధించి ఇప్పటికే పలువురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారి నుంచి పిస్తోలు.. ఆరు తూటాలు.. రూ.3.2లక్షల క్యాష్.. రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కడపలోని చిన్నచౌకు పాత బైపాస్ కూడలి దగ్గర టీ బంకు దగ్గర అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురిని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రియాక్ట్ అయిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ సందర్భంగా వారి నోటి నుంచి వచ్చిన విషయాలు విని షాక్ తిన్నారు. టీడీపీ సీనియర్ నేతగా సుపరిచితులు.. కర్నూలు జిల్లా నంద్యాల రాజకీయాల్లో తన ముద్ర వేసిన ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేయాలన్నది వారి ప్లాన్ గా తేలింది.

ఏవీని హత్య చేసేందుకు రూ.50లక్షలకు డీల్ కుదిరిందని.. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉండే ఏవీ సుబ్బారెడ్డిని హతమార్చేందుకు నిందితుడు పక్కీర్ ప్లాన్ చేశాడు. డీల్ లో భాగంగా ముందుగానే రూ.15లక్షల మొత్తాన్ని సుపారీగా తీసుకున్నాడు. హత్య చేసిన తర్వాత మిగిలిన బ్యాలెన్స్ మొత్తాన్నితీసుకునేలా డీల్ కుదుర్చుకున్నాడు.

ఇందులో భాగంగా మార్చి 12న సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు పక్కీర్ హైదరాబాదో లోని ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో పోలీసుల పెట్రోలింగ్ వాహనంతో రావటంతో భయపడిన పక్కీర్ వెనక్కి తగ్గాడు. తానొక్కడే హత్య చేయటం సాధ్యం కాదని భావించిన అతడు.. రవిచంద్రారెడ్డి.. రామిరెడ్డిలతో కలిసి హత్యకు ప్లాన్ చేశారు.

దీనికి సంబంధించిన ప్లాన్ గురించి మాట్లాడుకునేందుకు వారు కడపకు చేరుకోగా.. అక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తున్న నేపథ్యంలో స్థానికుల సమాచారం మేరకు అరెస్టు అయ్యారు.సరైన సమయంలో పోలీసులు స్పందించటంతో సుబ్బారెడ్డి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని చెప్పాలి. ఇంతకూ వారితో డీల్ కుదుర్చుకుననది ఎవరన్నది పోలీసుల విచారణలో బయటకు వస్తుందని భావిస్తున్నారు.