Begin typing your search above and press return to search.

జనసేన ఆశావహ అభ్యర్థిగా హంతకుడు..

By:  Tupaki Desk   |   1 Feb 2019 10:41 AM GMT
జనసేన ఆశావహ అభ్యర్థిగా హంతకుడు..
X
డాక్టర్ గా మారుమూల ప్రాంతాల్లో సేవలందిస్తున్నాడు. మల్టీస్పెషాలిటీ పేరుతో ఆస్పత్రి పెట్టి సేవ చేస్తున్నాడు. జనసేనలోనూ పనిచేస్తున్నాడు. ప్రకాషం జిల్లా గిద్దెలూరు నియోజకవర్గ నేతగా చెలమాణీ అవుతున్నాడు. అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. పవన్ ను కలిసి టికెట్ కోసం ఓ దరఖాస్తు కూడా ఇచ్చేశాడు. ఇదంతా సేవ ముసుగులో ఆయన పైకి కనిపించే చిత్రం మాత్రమే..

ఆయన తెరవెనుక రెండో యాంగిల్ కూడా ఉంది. పేరు డాక్టర్ వెంకటరమణ. మనుషుల ప్రాణాలను కాపాడే డాక్టరే కాదు.. తీసే సామర్థ్యం కూడా ఈయన సొంతం. పరిచయం అయిన మహిళతో లైంగిక సంబంధం పెట్టుకొని ఆమె భర్త ఈ వ్యవహారానికి అడ్డుగా ఉన్నాడని చెప్పి.. ఆమె సాయంతో ప్రీ ప్లాన్డ్ గా చంపేశాడు. చివరకు చిన్న క్లూతో దొరికిపోయాడు. జైలుకు వెళ్లాడు.

ప్రకాశం జిల్లా కంభంలో డాక్టర్ బాల వెంకటరమణ అనే డాక్టర్ ఆస్పత్రి నిర్వహిస్తూ వస్తున్నాడు. ఆస్పత్రి వెనుకాల జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. డాక్టర్ వెంకటరమణకు వారితో పరిచయం అయ్యింది. జగన్మోహన్ రెడ్డి భార్యతో వెంకట రమణ వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలిసిన జగన్మోహన్ రెడ్డి భార్యను హెచ్చరించాడు. భర్తకు విషయం తెలిసిందని.. ఆ మహిళ ఈ డాక్టర్ తో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. ఆ నేత తన డాక్టర్ తెలివితేటలతో జగన్మోహన్ రెడ్డికి మత్తు మందు ఇచ్చి శ్రీశైలం అడువుల్లోకి తీసుకెళ్లి హత్య చేశాడు. హత్య తర్వాత నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇంటికే వచ్చి ఆయన భార్యతో గడిపి వెళ్లాడు. ఇలా ప్రీ ప్లాన్డ్ గా మర్డర్ చేసినప్పటికీ ఓ చోట జగన్మోహన్ రెడ్డితో డాక్టర్ వెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. పోలీసులు డొంక కదిలిస్తే డాక్టర్ బండారం బయటపడింది.

ప్రస్తుతం ఈ డాక్టర్ జనసేన పేరుతో చాలా హడావుడి చేస్తున్నాడు. తానే అభ్యర్థి అన్నంతగా చెలరేగిపోతున్నాడు. ఇతర నేతలు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ తో తనకు సాన్నిహిత్యం ఉందని చెప్పుకుంటూ కొన్ని ఫొటోలు.. భారీ ఫ్లెక్సీలు వేయిస్తున్నాడు. ఇప్పుడీ డాక్టర్ వ్యవహారంతో జనసేనకు గిద్దెలూరులో గట్టి దెబ్బ తగులుతోంది. గంలోనూ ఇలా అనేకసార్లు జనసేన నేతలుగా చెలామణీ అవుతూ.. అక్రమాలకు పాల్పడిన కేసులు వెలుగుచూశాయి. జనసేన అధిపతి పవన్ ఇలాంటి వాళ్లను పార్టీలో ఉంచితే ఆయన పార్టీకి ఇబ్బందులు తప్పవని నేతలు హెచ్చరిస్తున్నారు.