Begin typing your search above and press return to search.

లక్ష్మణ్ రాజ్యసభకు.. బీజేపీ కొత్త చీఫ్ ఇతడేనా?

By:  Tupaki Desk   |   7 Sept 2019 8:00 PM IST
లక్ష్మణ్ రాజ్యసభకు.. బీజేపీ కొత్త చీఫ్ ఇతడేనా?
X
తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడా.? అంటే అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు.. తాజాగా లీక్ అవుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో త్రిమూర్తులుగా ఉన్న కిషన్ రెడ్డి - దత్తాత్రేయ - లక్ష్మన్ లలో మొదటి ఇద్దరికి కేంద్రమంత్రి - గవర్నర్ పదవులు దక్కాయి. ఎమ్మెల్యేగా ఓడిపోయిన లక్ష్మన్ కు త్వరలోనే రాజ్యసభ సీటును ఇవ్వబోతున్నారనే టాక్ నడుస్తోంది.

ఇక ఐదేళ్లు టర్మ్ పూర్తి చేసుకొని గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని నిలబెట్టలేకపోయిన లక్ష్మన్ ను రాజ్యసభ ఎంపీగా పంపి కొత్త వారికి అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలని అధిష్టానం యోచిస్తున్నట్టు సమాచారం.

ఇందులో భాగంగా ప్రధానంగా ఇద్దరి పేర్లు చక్కర్లు కొడుతున్నాయట.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు - కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లలో ఎవరో ఒకరికి బీజేపీ అధ్యక్ష పదవి కట్టబెట్టబోతున్నారన్నది తాజాగా ప్రచారం జరుగుతున్న అంశం.

ఈ ఇద్దరిలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మురళీధర్ రావు కనుక ఒప్పుకుంటే డైరెక్ట్ గా ఆయనను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమిస్తారు. ఇప్పటికే పలు రాష్ట్రాల ఇన్ చార్జిగా ఆయన పనిచేశారు. ఇక ఆయన కాదంటే ఆ సీటును దక్కించుకోవడానికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నాడట.. సో లక్ష్మణ్ ను రాజ్యసభకు పంపి ఆ స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించాలని బీజేపీ యోచిస్తోంది. ఆ కొత్త నేత ఎవరన్నది మాత్రం మరికొద్దిరోజుల్లోనే తేలనుంది..