Begin typing your search above and press return to search.
స్నేహితులతో సరదాగా సినిమా చూస్తూ కుప్పకూలిపోయాడు
By: Tupaki Desk | 11 March 2023 5:00 PM GMTజిమ్ చేస్తూ ఒకరు.. స్పీచ్ ఇస్తూ మరొకరు.. డ్యాన్స్ వేస్తూ ఇంకొకరు. అప్పటివరకు బాగున్నట్లే ఉంటూ.. అకస్మాత్తుగా ప్రాణాలు విడుస్తున్న పలు ఉదంతాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఈసారి ఎలాంటి శారీరక కష్టం లేకుండా.. సరదాగా స్నహితులతో సినిమాను చూస్తూ కుప్పకూలిన ఒక యువకుడి ఉదంతం షాకింగ్ గా మారింది. ఇదెలా జరిగింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
తాను కోరుకున్న ఐటీ ఉద్యోగం వచ్చిందన్న ఆనందంతో.. ఆ గుడ్ న్యూస్ ను తల్లిదండ్రులకు చెప్పి.. వారిని ఆనందానికి గురి చేసేందుకు ఊరికి వచ్చిన ఒక యువకుడు సినిమా హాల్లో సినిమా చూస్తూ మరణించిన విషాద ఉదంతం ఎంతకూ మింగుడుపడనిదిగా మారింది.
ఖమ్మం జిల్లామధిరకు చెందిన 26 ఏళ్ల మురళీ క్రిష్ణ ఉదంతం గురించి తెలిస్తే నోటి వెంట మాట రానంత షాకింగ్ గా ఉంటుంది. తల్లిదండ్రులు ఇద్దరువ్యవసాయ కూలీలు. అయినప్పటికీ తమ కుమారుడ్ని ఉన్నత స్థానంలో చూసేందుకు కష్టపడి చదివించారు. బీటెక్ పూర్తి చేయించారు.ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లు చేశారు.
బీటెక్ పూర్తి అయినా తాను కోరుకున్న ఐటీ ఉద్యోగం రానప్పటికీ నిరాశ చెందకుండా మరో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న మురళీక్రిష్ణ.. ఎట్టకేలకు తాను అనుకున్నట్లే ఒక మంచి ఐటీ కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించాడు. ఈ నెల 17న జాబ్ లో చేరాల్సి ఉంది. దీంతో.. ఈ ఆనందకర విషయాన్ని తల్లిదండ్రులతో పంచుకోవటానికి వీలుగా ఊరికి వచ్చాడు.తనకు ఐటీ ఉద్యోగం వచ్చిందని.. తమకున్న కష్టాలు అతి త్వరలోనే తీరిపోతాయని చెప్పిన మురళీక్రిష్ణ మాటలతో అతడి తల్లిదండ్రుల ఆనందానికి గురయ్యాడు.
ఈ సంతోషాన్ని తన స్నేహితులతో పంచుకోవటానికి వెళ్లిన మురళీ.. వారితోకలిసి సరదాగా సినిమాకు వెళ్లాడు. అయితే.. సినిమా చూస్తుండగానే.. అనూహ్యంగా కుప్పకూలిపోవటంతో కంగారుపడ్డ స్నేహితులు అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అయితే.. అప్పటికే మరణించిన విషయాన్ని వైద్యులు వెల్లడించారు. దీంతో.. షాక్ తినటం స్నేహితుల వంతైంది. ఇక.. చేతికి అంది వచ్చిన కొడుకు.. అనూహ్యంగా అకాల మరణానికి గురి కావటాన్ని ఆ పెద్ద వయస్కులైన తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. వారి.. వేదన చూపురులను కలిచివేసేలా చేస్తున్నాయి. ఇలాంటి కష్టం పగోడికి కూడా రాకూడదని అక్కడున్న వారంతా అనుకోవటం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.