Begin typing your search above and press return to search.

ఆ టైంలోనే మునుగోడు ఉప ఎన్నిక.. బీజేపీ కీలక వ్యూహం

By:  Tupaki Desk   |   20 Sep 2022 5:30 AM GMT
ఆ టైంలోనే మునుగోడు ఉప ఎన్నిక.. బీజేపీ కీలక వ్యూహం
X
మునుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఉప ఎన్నికను ఎప్పుడు నిర్వహిస్తూ అప్పుడు కార్యాచరణలోకి దిగాలని ఓవైపు టీఆర్ఎస్, మరోవైపు బీజేపీ కాచుకు కూర్చున్నాయి. మధ్యలో కాంగ్రెస్ కూడా తన సొంత సీటును దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేక దృష్ట్యానే ఈ ఉప ఎన్నికను వాయిదా వేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలాఖరులోగా షెడ్యూల్ రావచ్చని బీజేపీ ఈ మేరకు సంకేతాలు పంపుతోంది.

ఒక అసెంబ్లీ స్థానం ఖాళీ అయితే ఆరునెలలలోగా అక్కడ ఎన్నికలు జరపాలి. ఇక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు వీటిని కలిపి నిర్వహిస్తారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్ లో జరగాల్సి ఉండడంతో వాటితోపాటు మునుగోడులో నిర్వహిస్తారని అంతా భావించారు. ఈసీ అనుకుంటే డిసెంబర్ లోనే మునుగోడులో నిర్వహించవచ్చు.

అయితే బీజేపీ ప్లాన్ వేరేగా ఉందని.. ఈ ఉప ఎన్నికల కోసం బీజేపీ పెద్దలు అందరూ ఫ్రీగా ఉండేందుకు దీన్ని సపరేట్ గా ఇస్తారని ప్రచారం సాగుతోంది. గుజరాత్ ఉప ఎన్నికల వేళ అక్కడ ప్రచారం చేయడానికి అమిత్ షా, మోడీ , జేపీ నడ్డా వెళతారు కాబట్టి మునుగోడుపై ఫోకస్ చేయలేరు. అందుకే మునుగోడు కోసం ప్రత్యేకంగా షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.

వచ్చే నెల అంటే అక్టోబర్ చివరిలో మునుగోడు ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. తెలంగాణ పర్యటనకు వచ్చిన హోంమంత్రి అమిత్ షా ఈ మేరకు పార్టీ నేతలకు సూచనలు ఇచ్చారని సమాచారం. ఈ ఉప ఎన్నిక ఎప్పుడు ఉంటుందన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పలేదట..

ఈసీ మాత్రం బీజేపీ పెద్దలు చెప్పినట్టు మునుగోడుపై ఏర్పాట్లు అన్ని పూర్తి చేస్తున్నట్టు సమాచారం. ఈసీ స్వతంత్ర్య సంస్థ అయినా అందులోని కమిషనర్లు బీజేపీ చెప్పినట్టుగా అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

బెంగాల్ సహా పలు రాష్ట్రాల ఎన్నికలను ఇలానే బీజేపీకి ఫేవర్ గా విడతల వారీగా నిర్వహించారు. దీంతో మునుగోడు సైతం బీజేపీకి నచ్చిన డేట్ లోనే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.