Begin typing your search above and press return to search.

మునుగోడులో ఇదో త‌ద్దినం.. కేసీఆర్ ఏం చేస్తారో?!

By:  Tupaki Desk   |   5 Oct 2022 2:30 AM GMT
మునుగోడులో ఇదో త‌ద్దినం.. కేసీఆర్ ఏం చేస్తారో?!
X
ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి.. ఉప ఎన్నిక‌ల షెడ్యూల్‌ వ‌చ్చేసింది. ఇక‌, నోటిఫికేష‌న్ మాత్ర‌మే రావాల్సి ఉంది. ఇప్ప‌టికే ఎన్నిక‌ల కోడ్ కూడా అమ‌ల్లోకి వ‌చ్చింది. ప్ర‌ధాన పార్టీల‌న్నీ కూడా.. దూకుడు ప్ర‌ద‌ర్శిం చేందుకు రెడీ అయ్యాయి. ఇప్ప‌టికే హోరా హోరీ పోరు త‌ప్ప‌ద‌ని రూఢీ అయిపోయింది. అయినా కూడా.. టీఆర్ ఎస్‌.. బీజేపీ.. కాంగ్రెస్‌లు.. ఎవ‌రికి వారే.. గెలుపుపై ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

నామినేష‌న్ దాఖ‌లు చేయుడు.. రంగంలోకి దూకుడు.. గెలుపు గుర్రం ఎక్కుడు.. అని భావిస్తున్నాయి. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి ఇక్క‌డ యూట‌ర్న్ తీసుకుంది. ప్ర‌భుత్వంపై అసంతృప్తితో ఉన్న వీఆర్ ఏలు, లారీ డ్రైవ‌ర్స్ అసోసియేష‌న్ స‌భ్యులు.. భూ నిర్వాసితులు.. పోడు భూముల హ‌క్కుల కోసం పోరాడుతున్న‌వారు.. ఉప పోరులో బ‌రిలో దిగేందుకురెడీ అవుతున్నార‌నే సంకేతాలు ఇస్తున్నారు. దీంతో ఇక్క‌డ వేడి మ‌రింత రాజుకుంది.

గ‌తంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి వ్య‌తిరేకంగా.. త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క స‌హా పలు రాష్ట్రాల రైతులు.. వార‌ణాసిలో నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. త‌ర్వాత‌.. కాలంలో తెలంగాణ‌లోనూ.. నిజామాబాద్ పార్ల‌మెంటు స్థానానికి రైతులు నామినేష‌న్ వేశారు. త‌మ‌కు ప‌సుపు బోర్డు రావాలంటూ.. ఇక్క‌డివారు డిమాండ్ చేశారు. ఈ క్ర‌మంలో వారు జోరుగా వంద‌ల సంఖ్య‌లో నామినేష‌న్లు వేయ‌డం.. సంచ‌ల‌నంగా మారింది.

ఇప్పుడు మునుగోడు బ‌రిలోనూ.. వీఆర్ ఏలు స‌హా కార్మిక సంఘాల నాయ‌కులు.. పోడు భూముల హ‌క్కు దారులు.. నామినేష‌న్లు వేసేందుకు రెడీ అవుతున్నారు.

దీంతో ఇక్క‌డ ప్ర‌ధాన పార్టీల‌కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితి నెల‌కొంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి ఇవ‌న్నీ.. చెల్ల‌వు. ఎన్నిక‌ల సంఘం కూడా వీటిని తిర‌స్క‌రిస్తుంది. కానీ, ఎన్నిక‌ల ముంగిట‌.. వ్య‌తిరేకత ను చాటేలా.. ఇన్ని నామినేష‌న్లు దాఖ‌లైతే.. పార్టీల‌కు ఇబ్బందే క‌దా.. అనేది చ‌ర్చ‌కు వ‌స్తున్న అంశం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.