Begin typing your search above and press return to search.
మునుగోడు ఉపపోరు.. కేంద్ర రాష్ట్రాల మధ్య కొత్త రణం
By: Tupaki Desk | 2 Nov 2022 3:57 AM GMTదేశంలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా ప్రచారం జరుగుతున్న మునుగోడు ఉప పోరు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. సాధారణంగా ఉప ఎన్నిక అన్నంతనే అధికారపక్షం.. విపక్షం మధ్య పోటీగా.. కాదంటే.. అభ్యర్థుల మధ్య వార్ గా ఉంటుంది. అందుకు భిన్నంగా ఈ ఉప పోరు.. తెలంగాణ అధికారపక్షానికి.. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు మధ్య పోరుగా మారిన వైనం విస్మయానికి గురి చేస్తోంది.
ఈ ఉప ఎన్నిక కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తమ పార్టీకి చెందిన మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీల్ని భారీ ఎత్తున దించటం.. రోజుల తరబడి నియోజకవర్గంలో ఉండి పాలన చేయాలన్న ఆర్డర్ వేసిన తీరు చూస్తే.. ఈ ఉప ఎన్నిక ఫలితం అధికార పార్టీకి ఎంత ముఖ్యమన్నది ఇట్టే అర్థం కాక మానదు. ఈ పోరు మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే.. ఇది రెండు పార్టీల అభ్యర్థుల మధ్య పోరు కంటే కూడా.. రెండు ప్రభుత్వాల మద్య కోట్లాటగా మారింది. అందుకు తగ్గట్లే ఎవరికి వారు తమ చేతిలో ఉన్న అస్త్రాల్ని ప్రయోగిస్తున్నారన్న విమర్శ వినిపిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్న పోలీసులు.. తమ తనిఖీల్లో ఇప్పటివరకు పట్టుకున్న నగదు మొత్తం.. బీజేపీ నేతలకు సంబంధించిందే కావటం గమనార్హం. అదే సమయంలో టీఆర్ఎస్ నేతలకు సంబంధించిన పలువురు ప్రముఖల ఇళ్లల్లో ఐటీ.. ఈడీలు తనిఖీలు చేయటం తెలిసిందే.
ఈ సందర్భంగా భారీ ఎత్తున నగదు.. డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్న అనధికార నగదు మొత్తం బీజేపీకి చెందినదే తప్పించి.. అధికార పార్టీకి చెందిన మొత్తం రూపాయి కూడా లేదన్న మాటను బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇదొక్కటి చాలు.. తెలంగాణ రాష్ట్ర పోలీసుల పనితీరు ఎలా ఉందో అర్థమవుతుందన్న మాట వినిపిస్తోంది.
తమ పార్టీ నేతలపై అదే పనిగా సాగుతున్న పోలీసు అధికారుల తనిఖీలకు సరైన సమాధానం ఇచ్చేందుకు కేంద్రం ఐటీ.. ఈడీ అధికారుల్ని దించినట్లుగా చెబుతున్నారు. ఈ వాదనకు తగ్గట్లే.. ఐటీ.. ఈడీ అధికారులు.. వారి టీంలు మత్తం టీఆర్ఎస్ నేతలు.. వారి మద్దతుదారులు.. సానుభూతిపరుల్ని మాత్రమే లక్ష్యం చేసుకొని తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇందుకు తగ్గట్లే.. ఐటీ.. ఈడీలు తనిఖీలు చేసిన ఎవరూ కూడా బీజేపీకి చెందిన వారు కానీ.. ఆ పార్టీ మద్దతుదారులు ఎవరూ లేని తీరు చూస్తే.. మునుగోడు ఉప పోరు ఎలాంటి వాతావరణంలో జరిగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చన్న మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.