Begin typing your search above and press return to search.

మునుగోడులో క‌ల‌క‌లం.. ఓటుకు అంత పంచుతున్నారా?

By:  Tupaki Desk   |   9 Oct 2022 3:37 PM GMT
మునుగోడులో క‌ల‌క‌లం.. ఓటుకు అంత పంచుతున్నారా?
X
ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక అన్ని పార్టీల‌కూ ప్ర‌ధానంగా మారింది. ఇక్క‌డ గెలిచి తీరేందుకు.. టీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు.. వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నాయి. నోటిఫికేష‌న్ రావ‌డం.. నామినేష‌న్ల ప‌ర్వం కూడా ప్రారంభం కావ‌డంతో ఇక్క‌డ ప్ర‌చారం మ‌రింత జోరుగా సాగుతోంది. అయితే.. సంద‌ట్లో స‌డేమియాలాగా.. ఓటుకు నోటు పంచుతున్నార‌నేది.. కాంగ్రెస్ నేత‌ల ప్ర‌ధాన ఆరోప‌ణ‌.

ఇది స‌ర్వ‌సాధార‌ణ‌మే అయినా.. కాంగ్రెస్ నేత‌లు చెబుతున్న‌ట్టుగా.. ఓటు.. ఏకంగా 30 నుంచి 40 వేల రూపా య‌లు పంచుతున్నారా? అనేది క‌ల‌క‌లం రేపు తున్న ప్ర‌శ్న‌. ఎందుకంటే.. సాధార‌ణంగా ఎన్నిక‌లు అన‌గానే..500 నుంచి 2000 వ‌ర‌కు ఓటుకు పంచిన సంద‌ర్భాలు ఉన్నాయి. హుజూరాబాద్‌లో 2000 చొప్పు న పంచార‌నేది తెలిసిందే. దుబ్బాక‌లో జ‌రిగిన ఉప ఎన్నిక‌లో రూ.1000 నుంచి 2000 మ‌ధ్య పంచారు. సాగ‌ర్‌లోనూ.. ఇదే త‌ర‌హాలో పంప‌కాలు జ‌రిగాయి.

అయితే.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌రానికి ముందు జ‌రుగుతున్న ఉప ఎన్నిక కావ‌డంతో.. మునుగోడు అన్ని పార్టీల‌కు అత్యంత‌కీల‌క‌మైన నేప‌థ్యంలో మ‌రికొంత ఎక్కువ‌గా అయితే.. పంప‌కాలు జ‌రుగుతాయ నే అంచ‌నాలు ఉన్నాయి. కానీ, కాంగ్రెస్ నేత‌లు చెబుతున్న‌ట్టుగా.. 30 వేల నుంచి 40 వేల వ‌ర‌కు ఓటు నోటు పంచుతార‌న‌డంలోనే ఉద్దేశ పూర్వ‌కంగా చేస్తున్న విమ‌ర్శ‌గా ఉంద‌ని అంటున్నారు. లేదంటే.. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ప‌క్క దారి ప‌ట్టించే వ్యూహం ఏదైనా ఉందా అనే అనుమానం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది.

ఏకంగా..కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం మ‌రింత‌సంచ‌ల‌నంగా మారింది. ఆయ‌న‌పై బీజేపీ.. టీఆర్ ఎస్ నేత‌లు కూడా ఫైర్ అవుతున్నారు. ఉద్దేశ పూర్వ‌కంగానే ప‌క్క‌దారి ప‌ట్టించే వ్యూహం అమ‌లు చేస్తున్నార‌ని.. అంటున్నారు. ఇంత సొమ్మును ఎవ‌రు పంచారో.. చెప్పాల‌ని కూడా బీజేపీ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్‌-టీఆర్ ఎస్ క‌లిసి ఆడుతున్న నాట‌కంగా వారు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. మునుగోడులో డ‌బ్బు పంప‌కం.. క‌ల‌క‌లం రేపుతుండ‌డం గ‌మ‌నార్హం.