Begin typing your search above and press return to search.

బాలయ్య ఇంటి ముట్టడి.. కార్మికుల నిరసన

By:  Tupaki Desk   |   21 Nov 2018 11:23 AM IST
బాలయ్య ఇంటి ముట్టడి.. కార్మికుల నిరసన
X
టీడీపీ ఎమ్మెల్యే - స్టార్ హీరో బాలక్రిష్ణకు ఆయన నియోజకవర్గ ప్రజల సెగ తగిలింది.. అనంతపురం జిల్లా హిందుపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బాలయ్య స్థానికంగా ఉండకపోవడంపై అక్కడి ప్రజలు చాలా సార్లు నిరసన తెలిపారు. తాజాగా 220మంది పారిశుధ్య కార్మికులను హిందూపురం మున్సిపాలిటీ తొలగించింది. దీంతో ఆగ్రహించిన కార్మికులు బుధవారం హిందూపురంలోని ఆయన ఇంటిని ముట్టడించారు. ఆయన నివాసంలోకి దూసుకెళ్లి బైఠాయించి నిరసన తెలిపారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కార్మికులను బాలయ్య ఇంటి నుంచి ఈడ్చి వేశారు. ఈ క్రమంలో పోలీసులకు - కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు కార్మికులు గాయపడ్డారు. మున్సిపల్ ఆందోళనలో పాల్గొన్న సీఐటీయూ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్మికులు వర్సెస్ పోలీసుల ఫైట్ తో హిందూపురంలో ఉద్రిక్త పరిస్థితులున్నాయి.. ప్రస్తుతం బాలయ్య ‘ఎన్టీఆర్’ సినిమాలో బిజీగా ఉన్నారు.