Begin typing your search above and press return to search.

మున్సిపల్ లైవ్: వైసీపీ ఖాతాలో 15 మున్సిపాల్టీలు.. బోణి కొట్టని టీడీపీ

By:  Tupaki Desk   |   14 March 2021 4:38 AM GMT
మున్సిపల్ లైవ్: వైసీపీ ఖాతాలో 15 మున్సిపాల్టీలు.. బోణి కొట్టని టీడీపీ
X
ఏపీలో పురపాలక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. సాయంత్రం 6 గంటల్లోగా ఫలితాలు పూర్తికానున్నాయి. ఏపీలో పెద్ద మున్సిపాలిటీ అయిన విశాఖపట్నం కార్పొరేషన్ ఫలితాలు ఆలస్యం కానున్నాయి.విశాఖ లో డివిజన్ల సంఖ్య ఎక్కువ కావడంతో ఆలస్యం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.ఇక హైకోర్టు ఆదేశాలతో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఓట్ల లెక్కింపును తాత్కాలికంగా నిలిపివేశారు.

11 నగరపాలక సంస్థల్లో 533 డివిజన్ సభ్యుల స్థానాలకు పోలైన 27,29,072 ఓట్లను లెక్కిస్తున్నారు. 71 పురపాలక, నగర పంచాయతీల్లో 1633 వార్డు సభ్యుల స్థానాలకు పోలైన 21,03,284 ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

తాజా ఫలితాల ప్రకారం వైసీపీ ఖాతాలో 13 మున్సిపాలిటీలు చేరాయి... మాచర్ల, పిడుగురాళ్ల, పులివెందుల, పుంగనూరు, డోన్, గిద్దలూరు, కనిగిరి, పలమనేరు, ఆత్మకూరు, మదనపల్లె, రాయచోటి, ఎర్రగుంట్ల, నాయుడుపేట, సూళ్లూరుపేట, కొవ్వూరులో వైసీపీ ఘనవిజయం సాధించింది.

*ప్రకాశం జిల్లాలో వైసీపీ ఖాతాలో గిద్దలూరులో 20 వార్డులకు గాను 13 వార్డుల్లో ఘనవిజయం. ప్రకాశం జిల్లా కనిగిరి ఆరోవార్డులో 121 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుపు. గిద్దలూరు ఆరోవార్డులో 604 ఓట్లతో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు.