Begin typing your search above and press return to search.
పరిషత్ నామినేషన్లలో కొత్త ట్రెండు
By: Tupaki Desk | 20 Feb 2021 4:47 AM GMTఅప్పట్లో నామినేషన్లు వేయలేకపోయిన వారికి మరోక అవకాశం ఇచ్చేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొత్త ట్రెండుకు తెరదీశారు. ప్రత్యర్ధుల బెదిరింపులు, ధౌర్జన్యాల కారణంగా పోయిన మార్చిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్దానాలకు నామినేషన్లు వేయలేకపోయిన వారికి మరొక అవకాశం ఇవ్వాలనే వివాదాస్పద నిర్ణయాన్ని నిమ్మగడ్డ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాము ఏ పరిస్దితుల్లో నామినేషన్లు వేయలేకపోయామో, నామినేషన్లు వేసినా విత్ డ్రా చేసుకోవాల్సొచ్చిందనే అంశాలను ఆధారపూర్వకంగా కలెక్టర్లను కలవాలని నిమ్మగడ్డ చెప్పారు.
నిమ్మగడ్డ ఇచ్చిన అవకాశం ఆధారంగా శుక్రవారం మొదటిరోజు 78 మంది తమ ఫిర్యాదులతో జిల్లాల రిటర్నింగ్ అధికారులను కలిశారు. చిత్తూరు జిల్లాలో 18, విశాఖపట్నంలో 19, కడపలో 14, పశ్చిమగోదావరి జిల్లాలో 27 మంది తమ దగ్గరున్న ఆధారాలతో సహా కలెక్టర్లకు ఫిర్యాదుచేశారు. వీళ్ళందరిలో అత్యధికులు ఎక్కువమంది తెలుగుదేశంపార్టీ వాళ్ళే అనటంలో సందేహం లేదు. నిజానికి బెదిరింపులు, ధౌర్జనాలతో నామినేషన్లు వేయలేకపోవటం అన్నది ఎక్కడైనా జరుగుతునే ఉంటుంది.
అయితే ఇలాంటి వ్యవహరాలను ముందుగానే నామినేషన్లు వేసేవారు ఊహించి అందుకు జాగ్రత్తలు తీసుకుంటారు. పార్టీ నేతలే ఈ జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే మొన్నటి మార్చిలో టీడీపీ తరపున చాలామంది నామినేషన్లు వేయటానికి పెద్దగా ఇష్టపడలేదు. అధికారపార్టీతో గొడవలు ఎందుకని, అంతకుముందే బంపర్ మెజారిటితో వైసీపీ గెలిచిన ప్రభావం కారణంగా తాము పోటీచేసినా ఉపయోగం ఉండదని చాలామంది పోటీకి ముందుకు రాలేదు. క్షేత్రస్ధాయిలోని మెజారిటి స్ధానాల్లో వాస్తవం ఇలాగుంటే నిమ్మగడ్డ రెండో అవకాశం ఇవ్వటమే వివాదాస్పదమైంది.
ఇందుకే వైసీపీ కోర్టులో కేసు వేయగానే ఫారం 10 ఇచ్చేసిన స్ధానాల్లో ఎన్నిక నిర్వహించేందుకు లేదని స్పష్టంగా చెప్పింది. చాలా చోట్ల గెలిచిన వాళ్ళకు రిటర్నింగ్ అధికారులు ఫారం 10 ఇచ్చేశారు. అయినా ఫిర్యాదులు వస్తునే ఉన్నాయి. మరి నిమ్మగడ్డ ప్రవేశపెట్టిన కొత్త ట్రెండు కారణంగా శనివారం చివరిరోజున ఇంకెన్ని వివాదాలు రేగుతాయో చూడాల్సిందే.