Begin typing your search above and press return to search.
నిమ్మగడ్డతోనే చంద్రబాబు ఖేల్ ఖతం చేసే జగన్ ప్లాన్?
By: Tupaki Desk | 17 Feb 2021 3:42 AM GMTపంచాయతీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో చెప్పడం కష్టం. ఎందుకంటే గ్రామాల్లో ఎన్నిక అనేది పార్టీ గుర్తులపై జరగదు. గ్రామాల అభివృద్ధి కోసం ఏనాడో ఈ చట్టసవరణ చేశారు. అందుకే ఎవరు గెలిచానా ఇప్పుడు అధికార పార్టీ వైసీపీ నుంచే అంటున్నారు. ప్రతిపక్ష టీడీపీ, జనసేన నుంచి గెలిచినా పనులు, అభివృద్ధి కోసం తాము వైసీపీనే అంటున్నారు. అందుకే పంచాయతీల్లో ఎవరు ఎన్ని గ్రామాలు సొంతం చేసుకున్నారన్నది ముఖ్యం కాదు..
కానీ ఇప్పుడు ఏపీలో రాబోతున్నది మున్సిపల్, జడ్పీ ఎన్నికలు. ఇవి పార్టీ గుర్తుపైనే జరుగుతాయి. ఇదే ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబులో గుబులు పుట్టిస్తోంది. ఏపీలోని అధికార వైసీపీలో ధీమా కనపడుతోంది.
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చేతుల మీదుగానే ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. పంచాయతీ ఎన్నికలతో జగన్ సర్కార్ ను చెడుగుడు ఆడిన నిమ్మగడ్డతోనే సీఎం జగన్ మున్సిపల్, జడ్పీ పోరుకు దిగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వచ్చే నెలలో రిటైర్ కాబోతున్న నిమ్మగడ్డ చేతులమీదుగా ఈ ఎన్నికలకు వెళ్లడం అంటే.. నిజానికి ఇది చంద్రబాబు వేలితోనే ఆయన కన్ను పొడిచే ఎత్తుగడ అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
ఇన్నాళ్లు టీడీపీకి ఫేవర్ గా నిమ్మగడ్డ రాజకీయం చేశాడని వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. కానీ అదే నిమ్మగడ్డతో మున్సిపల్ ఎన్నికలకు పోతున్న వైసీపీ ప్లాన్ వేరే ఉందంటున్నారు. ఇవి పార్టీల గుర్తుపై జరగడం.. వైసీపీ అధికారంలో ఉండడంతో ఆ పార్టీకే ఎడ్జ్ ఉంటుంది. తద్వారా చంద్రబాబును చిత్తు చేయవచ్చని వైసీపీ ప్లాన్ చేసింది. ఈ ప్లాన్ ప్రకారం నిమ్మగడ్డతోనే నోటిఫికేషన్ వేయించి పుర, జడ్పీ పోరుకు రెడీ అయ్యింది.
ఈ మున్సిపోల్స్, జడ్పీలో కనుక టీడీపీ ఓడిపోతే ఇక వచ్చే 2023లో గడ్డు పరిస్థితులు ఖాయం. వైసీపీ గెలిచి రెండేళ్లే కావడం.. అధికారంలో ఉండడంతో ఆ పార్టీకి ఇది ఖచ్చితంగా ఆదిపత్యం ఇస్తుంది. అందుకే నిమ్మగడ్డతోనే చంద్రబాబును కొట్టే ప్లాన్ ను జగన్ తెరపైకి తెచ్చాడని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.