Begin typing your search above and press return to search.
రోహిత్ టెస్ట్ కెప్టెన్ గా వచ్చేయ్.. ముంబై విజయంతో ఫ్యాన్స్ డిమాండ్
By: Tupaki Desk | 11 Nov 2020 3:45 AM GMTరోహిత్ సేన ఐపీఎల్లో జైత్రయాత్ర కొనసాగిస్తోంది. వరుసగా రెండో సారి కూడా ఫైనల్లో విజేతగా నిలిచి ట్రోఫీ నిలబెట్టుకుంది. మొదటి 13 సీజన్లలో ఐదో సీజన్ల పాటు ట్రోఫీ గెలవని ముంబై ఆ తర్వాత 8 సీజన్లలో ఐదుసార్లు విజేతగా నిలిచి రికార్డ్ సాధించింది. గాయాలతో కొన్ని మ్యాచ్ లకు దూరమై తిరిగి జట్టులోకి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ (51 బంతుల్లో 68; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించి జుట్టును గెలిపించడంతో పాటు ఐదో సారి ట్రోఫీని ముద్దాడాడు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ని తొమ్మిదేళ్లుగా నడిపిస్తున్న విరాట్ కోహ్లీ ఒక్కసారి కూడా జట్టును గెలిపించ లేక పోగా రోహిత్ శర్మ మాత్రం ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఐదుసార్లు ఐపీఎల్లో తన జట్టును విజేతగా నిలిపాడు. దీంతో టెస్టుల్లో కూడా రోహిత్ సారథ్యం వహించాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు.
మంగళవారం రాత్రి జరిగిన ఫైనల్లో ముంబై 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (50 బంతుల్లో 65 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), రిషభ్ పంత్ (38 బంతుల్లో 56; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించ గా స్టొయినిస్ (0) , అజింక్య రహానే (2), శిఖర్ ధావన్ (15), హెట్‌మైర్ (5, )విఫలం అయ్యారు.
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' ట్రెంట్ బౌల్ట్ (3/30) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం ఛేదనలో ముంబై 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు సాధించి విన్నర్ గా నిలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ (51 బంతుల్లో 68; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా, ఇషాన్ కిషన్ (19 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా మెరవడం తో మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ముంబై విజయాన్ని అందుకుంది. కాగా యువ ఢిల్లీ మొదటి సారి ఫైనల్ దాకా వచ్చి నిరాశ గా ఇంటి బాట పట్టింది.
హిట్ మ్యాన్ టెస్ట్ లకు కెప్టెన్ అయితే బెస్టు
బలమైన జట్టు ఉండి కూడా ఒక్కసారి కూడా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కప్ ముద్దాడ కోవడంతో ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. బెంగళూరు నీ విజేతగా నిలపడం కోహ్లీ వల్ల కాదని కామెంట్స్ చేస్తున్నారు. విరాట్ సారధ్యంలో టెస్టుల్లో విజయాలు తగ్గిపోయాయని కెప్టెన్సీ రోహిత్ శర్మ కు అప్పగిస్తే టీంమిండియా మరో స్థాయికి చేరుకుంటుందని ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటికే రోహిత్ ఐపీఎల్లో ముంబైని ఐదు సార్లు విజేత గా నిలిపాడనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బీసీసీఐ ఈ విషయం లో తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.