Begin typing your search above and press return to search.
అరేబియన్ మహా సముద్రంలో ఉబర్ సర్వీసులు
By: Tupaki Desk | 20 Feb 2018 10:36 AM GMTకాలం మారింది బాస్. ఒక్క క్లిక్ తో మన అవసరాలన్నీ తీరిపోతున్నాయి. షాపింగ్ చేయాలన్నా - ప్రయాణం చేయాలన్నా అంతా క్షణాల్లో జరిగిపోతున్నాయి. అయితే అంతా బాగున్నా ఒక్కోసారి ఈ టెక్నాలజీ మాయకు భళ్లున నవ్వాల్సి వస్తుంది.
ఇక అసలు విషయానికొస్తే మనం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే క్యాబ్ బుక్ చేసుకొని వెళుతుంటాం. మనం బుక్ చేసుకున్న క్యాబ్ రోడ్డు మీద నడుస్తుంది. కానీ అస్లాం లొకేషన్ లో ఉన్న ఉబర్ క్యాబ్ అలా కాదు అరేబియన్ మహాసముద్రంలో నడుస్తుంది.
ఫిబ్రవరి-15న హాసన్ అనే వ్యక్తి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఆ క్యాబ్ లొకేషన్ అరేబియన్ మహాసముద్రంలో ఉన్నట్లు చూపించింది. అదేంటీ రోడ్డుమీద ఉండాల్సిన క్యాబ్ మహా సముంద్రంలో ఉండడం ఏంటనీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
అనంతరం ‘అస్లాం బాయ్ సబ్ మైరైన్ సే ఆరెలీ హై’ ఆంటూ ఆ లోకేషన్ చూపుతున్న విషయాన్ని స్ర్కీన్ షాట్ తీసి తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. అది ఉబర్ క్యాబ్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా జోడించాడు
ఇప్పుడీ పోస్ట్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే ఆ ఫేస్ బుక్ పోస్ట్ ను 1700 మంది లైక్ చేయగా 4500 మంది షేర్ చేశారు. పోస్ట్ చూసిన నెటిజన్లంతా నవ్వుకుంటూ కామెంట్ చేస్తున్నారు.