Begin typing your search above and press return to search.
వామ్మో ..ముంబై వూహాన్ ను దాటేసిందిగా!
By: Tupaki Desk | 10 Jun 2020 8:50 AM GMTవైరస్ విజృంభణతో భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై వణికిపోతోంది. ఇప్పటికే పాజిటివ్ కేసుల్లో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనాను అధిగమించిన మహారాష్ట్ర.. తాజాగా మరో అపఖ్యాతిని మూటకట్టుకుంది. వైరస్ పుట్టిన చైనాలోని వూహాన్ నగరాన్ని ముంబై మహానగరం అధిగమించింది. వూహాన్ లో మొత్తం 50,333, పాజిటివ్ కేసులు నమోదుకాగా 3,869 మంది మృత్యువాత పడ్డారు. ముంబైలో ఇప్పటివరకు 51,000 కేసులు నిర్ధారణ కాగా, 1,760 మరణించారు.
దీన్ని బట్టే అర్థమౌతుంది వూహాన్ ను మించి ముంబైలో వైరస్ విభృంభిస్తున్నట్లు. అయితే అక్కడితో పోల్చుకుంటే ముంబైలో మరణాల సంఖ్య కొంత తక్కువగా ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 2,259 కేసులు నిర్ధారణ కాగా.. దేశంలో ఆ సంఖ్య 9,987గా నమోదైంది. ఇక రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య లక్షకు చేరువలో ఉండగా.. భారత్‌లో ఆ సంఖ్య 2 లక్షల 66వేలు దాటింది. మరోవైపు దేశంలో 7466 మరణాలు సంభవించగా.. ఒక్క మహారాష్ట్రలోనే 3,289 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో మహారాష్ట్ర - ఢిల్లీ - గుజరాత్ - తమిళనాడు రాష్ట్రాల్లో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక ఐదో విడత లాక్ డౌన్ లో ఇచ్చిన సడలింపులతో వైరస్ వ్యాప్తి తీవ్రరూపం దాల్చుతోంది. ఈ క్రమంలోనే జూలై నాటికి దేశ రాజధాని ఢిల్లీ 5లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.