Begin typing your search above and press return to search.
ట్రెండింగ్: ట్విట్టర్లో ఓ యువతి పుట్టిన రోజు.. పోలీసుల స్పెషల్ గిఫ్ట్!
By: Tupaki Desk | 25 April 2021 12:30 PM GMTకరోనా వేళ విందులు, వేడుకలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కేవలం మనకు మాత్రమే కాకుండా మనతో ఉండేవారికీ మంచిది. ఇలా ఆలోచించే ముంబయికి చెందిన యువతి సమతా పాటిల్ తన పుట్టిన రోజును నిరాడంబంరంగా జరుపుకున్నారు. పార్టీ కావాలని స్నేహితులు ఒత్తిడి తెచ్చినా అందుకు నిరాకరించినట్లు ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని మిత్రులకు సూచించినట్లు వివరించారు.
ఆమెను ఇంట్లోనే ఉండాలని ముంబయి పోలీసులు ట్వీట్ చేశారు. తన మిత్రులను కలవాలని తనకూ ఉన్నా కరోనా దృష్ట్యా ఇంట్లోనే పుట్టిన రోజు జరుపుకున్నాని ట్విట్టర్ వేదికగా ఆమె తెలిపారు. ఫలితంగా ఆమెకు పోలీసుల నుంచి ఊహించని బహుమతి లభించింది. ఇటీవల కాలంలో ముంబయి పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులుగా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా యువతలో ఉత్సాహం నింపుతున్నారు. సమతా పాటిలో పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు ఓ చాక్ లెట్ కేకు పంపించారు. రెస్పాన్సిబుల్ సిటిజన్ అని రాసి కేకును బహుమతిగా ఇచ్చారు.
ఆమె బాధ్యతాయుతమైన ప్రవర్తనకు గాను పోలీసులు మాట్లాడతామని చిరునామా అడిగా ఈ చిరు కానుక పంపించారు. కాగా ఆ యువతి చాలా సంతోషం వ్యక్తం చేశారు. తన పుట్టిన రోజు ఇంత అద్భతంగా జరిపినందుకు ధన్యవాదాలు టూ ముంబయి పోలీస్ అంటూ ట్వీట్ చేశారు. బయటకు వెళ్లి జరుపుకున్న వేడుక కన్నా పోలీసుల గిఫ్ట్ చాలా నచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు.
సాధ్యమైనంత వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండేందుకు ముంబయి పోలీసులు కృషి చేస్తున్నారు. కరోనా మహమ్మారిపై సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ యువతి పుట్టిన రోజు. ఇక పోలీసులకు సహకరిస్తూ అత్యవసరమైతేనే బయటకు రావాలని పోలీసులు కోరుతున్నారు. ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.