Begin typing your search above and press return to search.
బాలీవుడ్ యంగ్ హీరోకు ముంబయి పోలీసుల చలనా పంచ్
By: Tupaki Desk | 19 Feb 2023 10:18 AM GMTతప్పు ఎవరు చేసినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్న మాట తరచూ వింటుంటాం. ఇలాంటి మాటలకు ఏ మాత్రం సంబంధం లేకుండా చేతలు జరుగుతుంటాయి. కానీ.. అప్పుడప్పుడు మాత్రం కొన్ని మినహాయింపులు ఉంటాయి. తాజా ఉదంతం ఆ కోవకు చెందిందనే చెప్పాలి.
తాజాగా బాలీవుడ్ యంగ్ హీరోకు ముంబయి పోలీసులు దిమ్మ తిరిగే షాకిచ్చారు. అతగాడు చేసిన తప్పునకు ఫైన్ వేయటమే కాదు.. ఆ విషయాన్ని ట్విటర్ వేదికగా సోషల్ మీడియా ప్రపంచానికి తెలియజేయటంతో.. ఆయ్యగారు మింగా లేక కక్కాలేక మారు మాట్లాడని పరిస్థితిని కల్పించారు. ఇంతకూ ఏం జరిగిందంటారా? అక్కడికే వస్తున్నాం.
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్.. అదేనండి మన బన్నీ గ్రాఫ్ ను భారీగా పెంచేసిన అల వైకుంఠపురం మూవీని హిందీలో రీమేక్ చేయగా.. అందులో హీరోగా నటించింది ఇతగాడే.
మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీని హిందీలో 'షెహజాదా' పేరుతో తెరకెక్కించారు. పలు చిత్రాలతో బిజీగా ఉన్న అతను తాజాగా ముంబయిలోని ఫేమస్ టెంపుల్ అయిన సిద్ది వినాయక గుడికి వచ్చారు.
ఈ సందర్భంగా తన ఖరీదైన కారును ఆయన రాంగ్ పార్కింగ్ లో ఉంచారు.అయితే.. ఆ సమయంలో ఆయన కారును డ్రైవ్ చేయటం లేదని చెబుతున్నారు. ఆయన చేసినా.. ఆయన డ్రైవర్ చేసినా.. తప్పు తప్పే. రాంగ్ పార్కింగ్ లో నిలిపిన కార్తీక్ ఆర్యన్ కారుకు ముంబయి పోలీసులు ఫైన్ వేశారు. అక్కడితో ఆగకుండా ఇదే విషయాన్ని తమ ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. దానికి సినిమాటిక్ పంచ్ ను తోడు చేయటం ద్వారా.. అందరి కంట్లో పడేలా చేసింది.
రాంగ్ సైడ్ లో ఆర్యన్ కార్తీక్ కారును నిలిపిన ఫోటోను పోస్టు చేసిన ముంబయి ట్రాఫిక్ పోలీసులు.. ''కారు రాంగ్ సైడ్ లో పార్కు చేయబడింది. షెహజాదా ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించగలడని అనుకోవద్దు' అంటూ అని సినిమా డైలాగ్ తో పంచ్ వేశారు. చేసిన తప్పునకు ఫైన్ పంచ్ ఒకటైతే.. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయటం ద్వారా.. అతగాడికి ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చారని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.