Begin typing your search above and press return to search.

ఆ క్రికెటర్ మాజీ లవ్వర్ ఈ కేసులో దొరికింది

By:  Tupaki Desk   |   26 Oct 2016 4:36 AM GMT
ఆ క్రికెటర్ మాజీ లవ్వర్ ఈ కేసులో దొరికింది
X
సినిమా.. మోడలింగ్ రంగాలకు చెందిన కొందరు ప్రముఖులు అప్పుడప్పడు వ్యభిచారం నేరం కింద పోలీసులు అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే పుణెలో చోటు చేసుకోవటం సంచలనంగా మారింది. ప్రముఖ మోడల్ ను వ్యభిచారం చేస్తున్న నేరం కింద ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందస్తుగా అందిన సమాచారంతో పోలీసులే మారువేషంలో విటులుగా వెళ్లి మరీ ఆమెను అరెస్ట్ చేశారు.

గతంలో పాకిస్థానీ క్రికెట్ కెప్టెన్ ను తన ప్రియుడిగా పేర్కొని సంచలనం సృష్టించిన సదరు మోడల్ ను నిర్వాహకులకు రూ.50వేలు చెల్లించి.. ఆమె ఉందని చెప్పిన ఫైవ్ స్టార్ హోటల్ లోని రూమ్ నెంబరు 309కి వెళ్లారు. ఆమెతో పాటు అక్కడ మరికొందరు కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. జ్యూయలరీ ప్రకటనల్లో తళుక్కున మెరిసే ఈ అగ్రశ్రేణి మోడల్.. ఇలాంటి కేసులో దొరికిపోవటం హాట్ టాపిక్ గా మారింది.

సదరు మోడల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమెను అక్కడికి దగ్గర్లోని మహిళా సంక్షేమ శాఖకు చెందిన గృహానికి తరలించారు. ఈ క్రమంలో ఆమె తప్పించుకోవటంతో.. ఆమెను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో ఆమెను విచారించగా.. తాను పాకిస్థాన్ కెప్టెన్ మాజీ ప్రేయసినని చెప్పినట్లుగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/