Begin typing your search above and press return to search.

ముంబై మరో ఘనత..ఈసారి ఏమొచ్చిందంటే?

By:  Tupaki Desk   |   7 Feb 2021 12:30 PM GMT
ముంబై మరో ఘనత..ఈసారి ఏమొచ్చిందంటే?
X
దేశంలో నివాసయోగ్యమైన ఖరీదైన నగరం ఏది? చీప్ గా ఏ నగరంలో ప్రజలు బతుకుతున్నారు? ఉద్యోగులు ఉండడానికి చీప్ గా ఏ నగరం సేఫ్..? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తుంటాయి. అయితే తాజాగా దీనిపై సర్వే నిర్వహించగా ఆసక్తికర విషయాలు తెలిశాయి..

కరోనాతో మహానగరాలు హై అతలాకుతలం అవుతున్నాయి. దీంతో విస్తరించిన ఐటీ రంగం ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోం’ ఆప్షన్ ఇచ్చి ఇళ్లకు పంపించారు. దీంతో చాలా మంది టెక్కీలు ఇప్పుడు నగరాలను ఖాళీ చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ రంగంలోనే కాదు.. కంప్యూటర్ ఆధారిత ప్రతీరంగంలోనూ తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటును కంపెనీలు కల్పిస్తున్నాయి.

కరోనా ఇప్పట్లో తగ్గేలా లేదు. దీంతో ఐటీ సహా అన్ని సంస్థల ఉద్యోగులు ఇంటినుంచే పనిచేయాల్సి ఉంటుంది. ఐటీ సిటీ అయిన బెంగళూరు ఇప్పుడు ఖాళీగానే కనిపిస్తోంది. టెక్కీలంతా తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. కరోనా తగ్గేవరకు ఇంటినుంచే పనిచేయనున్నారు. ఇప్పట్లో తగ్గడం కష్టం కావడంతో ఎప్పటికీ తగ్గుతుందో తెలియక బెంగళూరులోని తమ ఖరీదైన ప్లాట్లను టెక్కిలు ఖాళీ చేస్తున్నారు. వేలకు వేల అద్దెలు భరించలేక ఈ పనిచేస్తున్నారు.

అయితే దేశవ్యాప్తంగా ఏ నగరంలో బతకలేని పరిస్థితులున్నాయనే దానిపై సర్వే నిర్వహించగా ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. దేశంలోనే అత్యంత ఖరీదైన నగరంగా ముంబై నిలిచింది. నెట్ ఫ్రాంక్ నిర్వహించిన ఈ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

ఇక దేశంలో అత్యంత సరసమైన గృహ నిర్మాణ మార్కెట్ గా అహ్మదాబాద్ నిలిచింది. ఇదే సమయంలో బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ ఖరీదైన నగరంగా మారిందని ఈ సర్వే తెలిపింది.

2010లో బెంగళూరులో 48శాతంగా ఉన్న ఆఫర్డబులిటీ హౌజింగ్ ఇండెక్స్ 28శాతంకు తగ్గగా.. హైదరాబాద్ లో 47శాతంగా ఉన్న ఇండెక్స్ 31కి తగ్గింది.