Begin typing your search above and press return to search.

ఐపీఎల్ లో క్రికెటర్లు అసభ్యంగా ప్రవర్తించారు: చీర్ లీడర్లు

By:  Tupaki Desk   |   16 July 2021 11:34 AM IST
ఐపీఎల్ లో క్రికెటర్లు అసభ్యంగా ప్రవర్తించారు: చీర్ లీడర్లు
X
ముంబై ఇండియన్స్ కు చెందిన ఐపీఎల్ చీర్ లీడర్ గాబ్రియెల్లా పాస్క్వాలోట్లో సంచలన వ్యాఖ్యలు చేసింది. మ్యాచ్ తర్వాత పార్టీలలో క్రికెటర్లు తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించింది. ఆమె మాటలతో ఐపీఎల్ లో తీవ్ర దుమారం రేపింది. వివాదానికి దారితీసింది. ఈ క్రమంలోనే ఆమెను ముంబై ఇండియాన్స్ చీర్ లీడర్ గా తొలగించారు.

గాబ్రియెల్లా వరుసగా ద్వేషపూరిత ట్వీట్లను చేసింది. ఐపీఎల్ మేనేజ్ మెంట్ తీరుపై విరుచుకుపడింది. ఈమే ట్వీట్లపై ఐపీఎల్ మేనేజ్మెంట్ కానీ.. ముంబై ఇండియాన్స్ ఫ్రాంచైజీ కానీ స్పందించలేదు.

ఇక గాబ్రియెల్లా మాటలకు తోటి చీర్ లీడర్లు మద్దతు పలికారు. 'తమను ఐపీఎల్ లో మాంసం ముక్కలుగా చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలలో క్రికెటర్లు తాగిన తర్వాత నిజంగానే హత్తుకునేవారు.. తప్పుగా ప్రవర్తించేవారు.. మేము ఆ టైపు బాలికలం అని వారు అనుకునేవారు అని మరో చీర్ లీడర్ ఆావేదన వ్యక్తం చేసింది.

ఐపీఎల్ లో గాబ్రియెల్లా చేదు అనుభవాలు బయటకు రావడంతో వైరల్ అయ్యింది. ఆమె ఐపీఎల్ లో జరిగే పార్టీలు, క్రికెటర్ల తీరు గురించి ఎండట్టింది. ఈ పార్టీల తరువాత ప్రతీచోట కెమెరాలు ఉన్నాయని వాళ్లు అంతా చూస్తారని.. అసభ్యంగా ప్రవర్తించినా ఎవరూ పట్టించుకోరని దీనిపై ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆమె వాపోయింది.

ఇక డబ్బు విషయంలోనూ పెద్దగా ఇవ్వరని.. గతంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి చెందిన చీర్ లీడర్లు తమకు చెల్లింపులు సకాలంలో చేయలేదని ఆరోపించారని గుర్తు చేసింది. జీవనోపాధి కోసం ఈ చీర్ లీడర్ వృత్తులను ఎంచుకున్నామని అంతేకాని వారి అవసరాలు తీర్చేందుకు కాదని గాబ్రియెల్లా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐపీఎల్ గురించి చెప్పుకొచ్చింది.

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రియా ఆటగాళ్లు తనతో అనుచితంగా ప్రవర్తించారని గాబ్రియెల్లా ఆ పోస్టులో ఆరోపించింది. మరికొందరు భారత ప్రేక్షకులు సైతం తమను సెక్స్ బొమ్మలుగా చూస్తారని ఆరోపించారు. అశ్లీల పదాలతో కించపరుస్తారని తెలిపింది.