Begin typing your search above and press return to search.
మరో జంపింగ్..గోయల్ లండన్ టూర్ ను అడ్డుకున్నారు
By: Tupaki Desk | 26 May 2019 5:27 AM GMTజెట్ ఎయిర్ వేస్ ను మొన్నటి వరకు నడిపించి ఏప్రిల్ లో పీకల్లోతూ నష్టాల్లో కూరుకుపోవడంతో చైర్మన్ నరేశ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు 15వేల కోట్లకు పైగా అప్పుల భారాన్ని జెట్ ఎయిర్ వేస్ మోస్తోంది. కొన్ని నెలలుగా ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో ఈ సంస్థపై ఈడీ, తీవ్రనేరాల పరిశోధన విభాగం. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేసులు నమోదు చేసి విచారిస్తున్నాయి..
ఈ నేపథ్యంలోనే జెట్ ఎయిర్ వేస్ ను నష్టాల్లో ముంచిన నరేష్ గోయల్ తాజాగా ముంబై నుంచి దుబాయ్ మీదుగా లండన్ వెళ్లడానికి ప్రయత్నించారు. తన భార్య పేరు మీద టికెట్స్, లగేజ్ బుక్ చేసుకొని ఎమిరేట్ విమానం ఎక్కేశారు. విమానం కూడా కదిలింది. కానీ ఇమిగ్రేషన్ అధికారులు వెంటనే పైలెట్ కు సమాచారం అందించి విమానాన్ని మళ్లీ వెనక్కి రప్పించారు. ఆ తర్వాత గోయల్ దంపతులను విమానం నుంచి దించేశారు.
ఇప్పటికే విజయ్ మాల్యా, నీరవ్ మోడీ కూడా ఇలానే దేశంలో బ్యాంకులను ముంచి లండన్ పారిపోయారు. ఇప్పుడు వారి బాటలోనే గోయల్ కూడా లండన్ పయనమవ్వడంతో అదికారులు అలెర్ట్ అయ్యారు. ఇప్పటికే అవినీతిపరులను కాపాడుతోందన్న విమర్శ బీజేపీపై ఉంది. ఇప్పుడు రెండోసారి గద్దెనెక్కాక అలాంటి అవకాశం ఇవ్వరాదనే బీజేపీ ప్రభుత్వం గోయల్ ను దేశం దాటకుండా నిర్బంధించింది.
అయితే అప్పులు తీర్చేందుకు.. పెట్టుబడుల కోసమే తాను లండన్ వెళుతున్నట్టు నరేష్ గోయల్ తెలిపారు. లండన్ లోని ఎతిహాద్ - హిందుజా గ్రూపులు జెట్ ఎయిర్ వేస్ లో పెట్టుబడులు పెడుతానన్నాయని.. చర్చించేందుకు వెళుతున్నట్టు నరేశ్ గోయల్ తెలిపారు. కాగా జెట్ ఎయిర్ వేస్ లో బకాయిపడ్డ 15వేల కోట్ల అప్పు తీర్చుకునేందుకు ఆ సంస్థలోని వాటాలను విక్రయించే సన్నాహాల్లో బ్యాంకర్లు ఉన్నారు.