Begin typing your search above and press return to search.

సోనూ.. ఇదెలా సాధ్య‌మైందిః కోర్టు నోటీసులు

By:  Tupaki Desk   |   28 May 2021 6:37 AM GMT
సోనూ.. ఇదెలా సాధ్య‌మైందిః కోర్టు నోటీసులు
X
క‌రోనా ఫ‌స్ట్‌, సెకండ్ వేవ్ లో సోనూ విస్తృత సేవాకార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌తోపాటు ప‌లువురు త‌మ చేత‌నైనంత స‌హాయం అందిస్తున్నారు. అయితే.. వీరు యాంటీ కొవిడ్ డ్ర‌గ్స్ ను సైతం బాధితుల‌కు అందిస్తున్నారు. దీనిపై కోర్టు వారిని ప్ర‌శ్నించింది. కొవిడ్ డ్ర‌గ్స్ పై అధికారం మొత్తం కేంద్ర‌ప్ర‌భుత్వానికే ఉన్న‌వేళ‌.. వీళ్ల‌కు ఆ మందులు భారీగా ఎక్క‌డి నుంచి వ‌స్తున్నాయ‌ని ప్ర‌శ్నించింది.

ఈ విష‌య‌మై ముంబై హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఈ మందులు స‌ర‌ఫ‌రా చేస్తున్న సోనూ సూద్ వంటి వారికి నోటీసులు జారీచేసింది. ఇందులో ఏదైనా బ్లాక్ మార్కెటింగ్ జ‌రిగిందా? అన‌ధికారికంగా మ‌రో ప‌ద్ధ‌తిలో మందులు తెచ్చుకుంటున్నారా? అన్న‌ది తేల్చాల‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

మాన‌వ‌తా దృక్ప‌థంతో వారు చేస్తున్న సేవ మంచిదే అని చెప్పిన కోర్టు.. దానికి వారు ఎలాంటి ప‌ద్ధ‌తుల‌ను అనుసరిస్తున్నార‌నేది కూడా ముఖ్య‌మేన‌ని వ్యాఖ్యానించిన‌ట్టు స‌మాచారం. ఈ నోటీసులు అందుకున్న‌వారిలో ముంబై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీష‌న్ సిద్ధికీ తదిత‌రులు ఉన్నారు.