Begin typing your search above and press return to search.
పీపీఈ కిట్లతో నరకం అనుభవిస్తున్నాం.. మా బాధలు ఎవరికీ పట్టవా?
By: Tupaki Desk | 23 Oct 2020 5:30 AM GMTకరోనా సృష్టించిన కల్లోలంతో యావత్ ప్రపంచమే అల్లకల్లోలంగా మారింది. అయితే ఎక్కువగా నష్టపోయింది మాత్రం కోవిడ్ రోగులకు వైద్యం చేస్తున్న డాక్టర్లు, వైద్యసిబ్బందే. కరోనా వచ్చినప్పటి నుంచి వారు నిత్యం క్షోభ అనుభవిస్తున్నారు. రోజులో ఆరు నుంచి 8 గంటల పాటు వారు పీపీఈ కిట్ ను ధరించాల్సి వస్తోంది. నిజానికి ఈ కిట్ వేసుకోవడం చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. ఈ పీపీఈ కిట్ తో సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ముంబైలో ‘కోవిడ్ వార్డుల్లో’ సేవలందిస్తున్న చాలా మంది డాక్టర్లకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. ఈ కిట్లు ధరించనప్పుడు ఊపిరి తీసుకో లేక పోతున్నామని వైద్యులు చెబుతున్నారు. ఒళ్లంతా చెమటలు పడుతున్నాయని.. నీళ్లు తాగే అవకాశం కూడా లేక డీహైడ్రేషన్ కు లోనవుతున్నామని వారు చెబుతున్నారు.
ముంబైకి చెందిన ఓ డాక్టర్ ఏమన్నారంటే.. ‘నేను గత మార్చి నుంచి ప్రతిరోజు పీపీఈ కిట్ ధరించి కోవిడ్ వార్డులో పనిచేశాను. ఇప్పుడు నేను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. కిట్ వేసుకున్నప్పుడు నాకు శ్వాస సరిగ్గా ఆడటం లేదు. ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి. నేను బరువు తగ్గిపోయాను. చాలా బలహీనంగా మారాను’ అని చెప్పారా డాక్టర్. ఇలా చాలా మంది పీపీఈ కిట్లతో ఇబ్బందులు పడుతున్నారు. ముంబైలో అనేకమంది పోలీసుల్లో పలువురు కోవిడ్ బారిన పడి మరణించగా.. డాక్టర్లు కూడా తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపలేకపోతున్నారు.