Begin typing your search above and press return to search.

షాకింగ్ గా మారిన బార్ డ్యాన్స‌ర్ మ‌ర్డ‌ర్‌

By:  Tupaki Desk   |   3 Jan 2018 5:42 AM GMT
షాకింగ్ గా మారిన బార్ డ్యాన్స‌ర్ మ‌ర్డ‌ర్‌
X
దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో ఒక హ‌త్య సంచ‌ల‌నం సృష్టిస్తోంది. మోడ‌ల్ క‌మ్ బార్ డ్యాన్స‌ర్ అయిన జ్యోతిని ఆమె ప్రియుడు అతి దారుణంగా హ‌త్య చేయ‌టం షాకింగ్ గా మారింది. న్యూఇయ‌ర్ వేడుకల‌కు కాస్త ముందుగా చోటు చేసుకున్న ఈ హ‌త్య ముంబ‌యిలో హాట్ టాపిక్ అయ్యింది.

పంజాబ్‌ లోని భ‌టిండా ప‌ట్ట‌ణానికి చెందిన జ్యోతి అలియాస్ నిషా జ్యోతి ముంబ‌యిలో మోడ‌లింగ్ తో పాటు బార్ డ్యాన్స‌ర్ గా ప‌ని చేసేది.

ఇదిలా ఉండ‌గా.. సూరత్ శివారులోని టింబా గ్రామానికి చెందిన 30 ఏళ్ల ప్రీతేష్ ప‌టేల్ త‌ర‌చూ ముంబ‌యిలోని బార్ కు వెళ్లేవాడు. ఈ క్ర‌మంలో బార్ డ్యాన్స‌ర్ అయిన జ్యోతితో ప‌రిచ‌యం.. రిలేష‌న్ గా మారి.. ఇరువురు స‌హ‌జీవ‌నం చేసే వ‌ర‌కూ వెళ్లింది.

డిసెంబ‌రు 27న జ్యోతి బ‌ర్త్ డే కావ‌టంతో ఆమె తాను స‌హ‌జీవ‌నం చేస్తున్న ప్రీతేష్ ప‌టేల్ ఫాం హౌస్ కు వ‌చ్చింది. ఇరువురుక‌లిసి బ‌ర్త్ డే పార్టీతో పాటు న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. అనంత‌రం వారి మ‌ధ్య వాదులాట మొద‌లైంది. జ్యోతికి మ‌రొక‌రితో రిలేష‌న్ ఉన్న‌ట్లుగా అనుమానంతో ఇరువురి మ‌ధ్య పెద్ద గొడ‌వ జ‌రిగింది.

దీంతో.. ఆగ్ర‌హం చెందిన ప్రీతేష్ గొడ్డ‌లితో జ్యోతిని న‌రికేశారు. జ్యోతి వెంట‌ వ‌చ్చిన డ్రైవ‌ర్ సందీప్ ఇచ్చిన స‌మాచారం మేర‌కు ఘ‌ట‌నాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రియుడి కోసం గాలిస్తున్నారు. ఈ హ‌త్య ముంబ‌యిలో క‌ల‌క‌లాన్ని రేపింది.

ఇదిలా ఉండ‌గా ప‌రారీలో ఉన్న ప్రీతేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారించ‌గా.. జ్యోతి కోసం తాను రూ.2కోట్లు ఖ‌ర్చు చేశాన‌ని.. అయిన‌ప్ప‌టికీ ఆమె వేరే వారితో రిలేషన్ పెట్టుకుంద‌ని ఆరోపించారు. అందుకే తాను ఆమెను హ‌త్య చేసిన‌ట్లుగా తెలుస్తోంది.