Begin typing your search above and press return to search.

ఆటో డ్రైవర్ బీభత్సం.. వీడియో వైరల్

By:  Tupaki Desk   |   25 Dec 2020 8:57 AM GMT
ఆటో డ్రైవర్ బీభత్సం.. వీడియో వైరల్
X
ముంబైలోని గోవండి ఏరియాలో ఆటోడ్రైవర్ బీభత్సం సృష్టించాడు. తనకు వార్నింగ్ ఇచ్చాడన్న కోపంతో టూ వీలర్ వాహనంపైకి ఆటోను ఎక్కించి దౌర్జన్యం చేశాడు. ఇదంతా సీసీ ఫుటేజీలో రికార్డ్ అయ్యింది. ఈ ఘటనలో డిసెంబర్ 17న చోటుచేసుకుంది. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

సయ్యద్ సల్మాన్ అనే ఆటోడ్రైవర్ డిసెంబర్ 17న గోవండి ఏరియాలో ఆటోను ర్యాష్ గా నడిపాడు.అదే సమయంలో బైక్ పై వెళ్తున్న కార్తిక్ అనే వ్యక్తిని ఢీకొట్టాడు. అలాగే సయ్యద్ ముందుకు వెళ్లిపోయాడు.

కొద్దిదూరంలో సిగ్నల్ పడడంతో సల్మాన్ ఆగడంతో కార్తిక్ వెళ్లి అడ్డుకొని వాదనకు దిగారు.ఆగ్రహించిన సయ్యద్‌ సిగ్నల్‌ రిలీజైన తర్వాత కార్తిక్‌ బైక్‌ను మరోసారి తోసుకుంటూ వెళ్లాడు. దీంతో అతను రోడ్డుపైనే కిందపడిపోగా హెల్మెట్‌ ఉండడంతో ప్రాణాపాయం తప్పింది.

సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఆటో నంబర్‌ ప్లేట్‌ను గుర్తించి సయ్యద్‌ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ర్యాష్‌గా డ్రైవింగ్‌ చేయడమే గాక హత్యకు యత్నించిన సయ్యద్‌పై సెక్షన్‌ 307, 279 కింద కేసు నమోదు చేశామని తెలిపారు.