Begin typing your search above and press return to search.
డ్రగ్స్ దందాకు కేంద్రంగా ముంబై: ఎన్సీబీ సంచలనం
By: Tupaki Desk | 16 Oct 2020 11:30 AM GMTదేశ ఆర్థిక రాజధాని ముంబై డ్రగ్స్ దందాకు అడ్డాగా మారిపోయిందా అంటే ఔననే అంటోంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఈ మేరకు గురువారం వివరాలు వెల్లడించింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణలో ఈ విషయం వెల్లడైందని తెలిపింది.
దేశంలోని పలు నగరాలకు ప్రధాన గమ్యస్థానంగా ముంబై ఉందని..దేశవ్యాప్తంగా కనెక్షన్లు ఉన్నాయని.. పలువురి నుంచి డ్రగ్స్ సీజ్ చేయడంతో పాటు అరెస్ట్ లు చేయడంతో ఈ విషయం వెలుగుచూసిందని కేంద్రం తెలిపింది. ఎన్సీబీ విచారణలో డ్రగ్ దందాపై పెద్ద ఎత్తున ఆపరేషన్స్ జరుగుతున్నాయని తేలిందన్నారు.
ఇటీవల వాసాయ్ కు చెందిన ఎం అహ్మద్ నుంచి 2 కిలోల పీసీపీ, 1కేజీ కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఎస్కే సౌరభ్ నుంచి డ్రగ్స్ వస్తుందని అహ్మద్ తెలిపారు. ఈ క్రమంలోనే ఎస్కే సౌరభ్ ను పట్టుకొని సోదాలు చేయగా.. గోడౌన్ లలో 29.300 కేజీల ఎమ్డీఏ డ్రగ్ దొరికిందన్నారు. ఈ ఇన్ ఫర్ మేషన్ తో జమ్మూలోనూ డ్రగ్స్ ను పట్టుకున్నారు.
ఇక తాజాగా నిర్వహించిన ఆపరేషన్ లో నైజీరియన్ దేశస్థుడైన ఉకా ఉమేకాను ఎన్సీబీ అరెస్ట్ చేసింది. ఈ డ్రగ్ ను దక్షిణ అమెరికా దేశం నుంచి వచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. మొత్తం దేశంలోని వివిధ ప్రాంతాలు, వివిధ దేశాల నుంచి ముంబైకే నేరుగా డ్రగ్స్ వస్తున్నాయని.. డ్రగ్ దందాకు ముంబై అడ్డాగా మారిందని కేంద్ర హోంశాఖ తెలిపింది.