Begin typing your search above and press return to search.

చేప‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్న ముంబ‌యి ఎయిర్ పోర్ట్!

By:  Tupaki Desk   |   1 July 2019 9:52 AM GMT
చేప‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్న ముంబ‌యి ఎయిర్ పోర్ట్!
X
దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో ప‌రిస్థితి ఇప్పుడు విచిత్రంగా మారింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వ‌రుస వ‌ర్షాల‌తో ఈ న‌గ‌రం ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. భారీ వ‌ర్షాల కార‌ణంగా విమాన రాక‌పోక‌ల‌కు ఇబ్బంది క‌లుగ‌ట‌మే కాదు.. లోత‌ట్టు ప్రాంతంలో ఉండే ఎయిర్ పోర్ట్ కు పెద్ద ఎత్తున చేప‌లు కొట్టుకొస్తున్నాయి.

ఎయిర్ పోర్ట్ కు స‌మీపంలోని స‌ర‌స్సులు.. న‌ల్లాల నుంచి పెద్ద ఎత్తున జ‌ల‌చ‌రాలు ఎయిర్ పోర్ట్ కు రావ‌టంతో ఇప్పుడు విమానాశ్ర‌యం మొత్తం చేప‌లు క‌నిపిస్తున్నాయి. ఇలా కొట్టుకొచ్చిన చేప‌ల్లో కొన్ని మూడు అడుగుల మేర ఉండ‌టం గ‌మ‌నార్హం. అంతేకాదు.. కొట్టుకొచ్చిన చేప‌ల్లో ఎక్కువ‌గా క్యాట్ ఫిష్ ర‌కానికి చెందిన‌వి ఉండ‌టంతో పైలెట్లు.. విమాన సిబ్బంది ఆస‌క్తిక‌రంగా చూడ‌టం క‌నిపిస్తోంది.

ముంబ‌యి ఎయిర్ పోర్ట్ కు ఓప‌క్క స‌ర‌స్సు.. మ‌రోవైపు న‌ల్లా.. మూడో వైపున ఆరేబియా స‌ముద్రం ఉండ‌టంతో భారీ వ‌ర్షాలు కురిసిన ప్ర‌తిసారి వ‌ర‌ద ముప్పును ఎయిర్ పోర్ట్ ఎదుర్కొంటోంది. ఎయిర్ పోర్ట్ దిగువ ప్రాంతంలో ఉండ‌టంతో భారీ వ‌ర్షాలు కురిసిన ప్ర‌తిసారీ వాన నీటితో తీవ్ర ఇబ్బందికి గుర‌య్యే ప‌రిస్థితిగా చెబుతున్నారు. ఎయిర పోర్ట్ లో నిలిచిన వ‌ర్ష‌పు నీటిని తొల‌గించేందుకు ఏకంగా ప‌ది మోటార్ల‌ను వినియోగిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. వాన జోరుకు ఎయిర్ పోర్ట్ సాధార‌ణ స్థితికి రావ‌టం లేదంటున్నారు. వాన తాకిడి త‌గ్గే వ‌ర‌కూ ఇదే ఇబ్బంది ఉంటుంద‌ని చెబుతున్నారు.