Begin typing your search above and press return to search.

బ్లాక్ జాకెట్‌..టీ ష‌ర్ట్‌..గాగుల్స్ తో ముమైత్

By:  Tupaki Desk   |   27 July 2017 5:33 AM GMT
బ్లాక్ జాకెట్‌..టీ ష‌ర్ట్‌..గాగుల్స్ తో ముమైత్
X
డ్ర‌గ్స్ విచార‌ణ‌లో నోటీసులు అందుకున్న సినీ ప్ర‌ముఖుల్లో ఎనిమిదో వ్య‌క్తి.. శృంగార గీతాల స్పెష‌లిస్ట్ ముమైత్ ఖాన్ సిట్ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఉద‌యం ప‌ది గంట‌ల‌కు సిట్ విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిన ఆమె.. 9.45 గంట‌ల వేళ‌లో సిట్ కార్యాల‌యానికి చేరుకున్నారు.

న‌టి ఛార్మి విచార‌ణ సంద‌ర్భంగా చోటు చేసుకున్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో సిట్ కార్యాల‌యంలో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాటు చేయ‌టంతో పాటు.. అన‌వ‌స‌ర‌మైన తోపులాట‌.. హ‌డావుడి లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. బ్లాక్ ఫ్యాంట్‌.. టీ ష‌ర్ట్‌.. పుల్ హ్యాండ్స్ తో కూడిన బ్లాక్ జాకెట్‌ ను ధ‌రించిన ఆమె.. క‌ళ్ల‌కు గాగుల్స్ పెట్టుకొని.. పెదాల‌కు లిప్ స్టిక్ వేసుకోవ‌టంతో పాటు.. కాస్త మేక‌ప్ తో సిట్ కార్యాల‌యానికి వ‌చ్చిన‌ట్లుగా క‌నిపించారు. చేతుల్ని జాకెట్ జేబుల్లో పెట్టుకొని ఆమె వేగంగా న‌డుచుకుంటూ విచార‌ణ‌కు వెళ్లారు.

అయితే.. ఆమె బాడీ లాంగ్వేజ్ చూసిన‌ప్పుడు మాత్రం కాన్ఫిడెంట్ గా ఉన్న‌ట్లు క‌నిపించ‌లేదు. ఎలాంటి తొట్రుపాటు లేకుండా ఆమె సిట్ కార్యాల‌యం లోప‌ల‌కు వెళ్లిన‌ట్లు అనిపించింది. నిన్న‌టి ప‌రిణామాల నేప‌థ్యంలో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేయ‌టం వ‌ల్ల‌.. ముమైత్ వెంట ప‌లువురు మ‌హిళా కానిస్టేబుళ్లు ఉన్నారు.

సిట్ కార్యాల‌యంలో గేటు దాటి పై అంత‌స్తుకు వెళ్లే వేళ‌లో ముమైత్ తో పాటు పొడుగు వ్య‌క్తి ఒక‌రు వెంట ఉన్నారు. వైట్ ష‌ర్ట్‌.. గాగుల్స్ ధ‌రించిన ఆయ‌న ముమైత్ వెంట వెళుతుండ‌గా.. మ‌హిళా పోలీసులు ఆయ‌న్ను అడ్డుకున్నారు. ఎవ‌ర‌న్న వివ‌రాలు అడిగిన వారు.. ఆయ‌న నోరు విప్పిన వెంట‌నే ప‌క్క‌న‌కు జ‌రిపేయ‌టం గ‌మ‌నార్హం. దీంతో.. ముమైత్ ఒక్క‌రే విచార‌ణ‌కు పై అంత‌స్థుకు వెళ్లారు. ఆమె వెంట మ‌హిళా పోలీసులు ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం ముమైత్ విచార‌ణ సాగనుంది.