Begin typing your search above and press return to search.

స్మార్ట్​ ఫోన్​లో ఫేస్​బుక్​.. టీవీలో వార్తలు ఓకేసారి చూస్తున్నారా? అయితే మీకు మతిమరుపు పక్కా

By:  Tupaki Desk   |   3 Nov 2020 12:30 AM GMT
స్మార్ట్​ ఫోన్​లో ఫేస్​బుక్​.. టీవీలో వార్తలు ఓకేసారి చూస్తున్నారా? అయితే మీకు మతిమరుపు పక్కా
X
ప్రస్తుత పోటీప్రపంచంలో మనిషి ఎంతో బిజీగా ఉంటున్నాడు. ఏక కాలంలో టీవీలో వార్తలు, స్మార్ట్​ఫోన్లో ఫేస్​బుక్​, వాట్సాప్​ వంటి సోషల్​ మీడియాలో నోటిఫికేషన్లు చూస్తున్నారు. రెండుమూడు పనులు ఏకకాలంలో చేయడం (మల్టీటాస్కింగ్​) సరికాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మల్టీ టాస్కింగ్​తో మతిపరుపు, డిప్రెషన్​ వంటి వ్యాధులు రావొచ్చని చెబుతున్నారు.

ఓకే కాలంలో రెండు మూడు పనులు చేయడం వల్ల శరీరంలో కార్టిసాల్​ అనే ఒత్తిడి హార్మోన్​లో వచ్చే మార్పుల కారణంగా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని వైద్యులు చెబుతున్నారు. చాలా మంది ఇన్‌స్టాగ్రామ్, టీవీ ఒకే సమయంలో చూస్తుంటారు. ఒకే సమయంలో బ్రౌజర్‌లో ఓపెన్ చేసినా 25 లేదా అంతకంటే ఎక్కువ ట్యాబ్‌లను చూడటం కూడా అనేక సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు.

ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. మీడియా మల్టీ టాస్కింగ్.. మల్టీ డివైజ్‌లు లేదా ఒక యాప్ చూస్తూనే మరో యాప్ ఓపెన్ చేయడం వంటి పలు రకాల డిజిటల్ మాధ్యమాలను కలిపి ఒకేసారి ఉపయోగించడం మెమరీ వైఫల్యానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. స్టాన్​ఫర్డ్​ మెమొరీ ల్యాబ్​కు చెందిన కెవిన్​ మడోర్​ అనే శాస్త్రవేత్త ఈ అంశంపై పరిశోధన సాగించారు.

మల్టీ డిటిటల్​ మల్టీ డిజిటల్ మీడియా వినియోగించే వ్యక్తులు ఏకాగ్రత కోల్పోయినట్టు వారి అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధక బృందం 18 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్య వయస్సు గల 80 మంది వ్యక్తులపై అధ్యయనం నిర్వహించింది. ఎలెక్ట్రోఎన్సెఫలోగ్రఫీ (ఇసిజి) పపిల్లోమెట్రీ వంటి పద్ధతులతో వరుసగా మెదడు కార్యకలాపాలను జ్ఞాపకశక్తిని పరిశీలించారు. ఇందులో పాల్గొనేవారిని వరుస ఫొటోలతో కూడిన స్క్రీన్‌ను చూడమని సూచించారు. వారు ఆ ఫొటోలను ఎంతగా ఇష్టపడ్డారో రేటింగ్ చేయమన్నారు. ఆ తర్వాత 10 నిముషాల పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. ఆపై వారికి మరిన్ని ఫొటోలు చూపించారు. ఇప్పటికే వాటిని చూశారా అని గుర్తించమని అడిగారు. ఒక ప్రశ్నపత్రం ఇచ్చి.. అందులో రోజువారీగా ఎంతసేపు చూస్తున్నారో లెక్కించమని అడిగారు. మీడియా మల్టీ టాస్కింగ్‌ చేయని వారికంటే చేసేవారే ఎక్కువగా శ్రద్ధ కోల్పోతారని కనుగొన్నారు. మల్టీ టాస్కింగ్​ చేసేవారు తొలుత చూపించిన ఫొటోలను మళ్లీ చూపిస్తే గుర్తించలేకపోయారు. అందువల్ల ఒకేసారి రెండు పనులు చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.