Begin typing your search above and press return to search.
కెనడాను తలదన్నేలా వరంగల్ లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి !
By: Tupaki Desk | 22 Jun 2021 8:41 AM GMTహైదరాబాద్ కంటే వరంగల్ తక్కువేమీ కాదని, వరంగల్ దేశంలోనే గొప్ప విద్యా కేంద్రం, వైద్య కేంద్రం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తూర్పు తెలంగాణకు ఈ నగరం హెడ్ క్వార్టర్ కావాలని, అత్యంత అధునాతన వైద్య సేవలు ఇక్కడ అందాలని చెప్పారు. వరంగల్ లో నిర్మించే మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి టాలెస్ట్ టవర్ ఆఫ్ వరంగల్ గా ఉండాలని, ఏడాదిన్నరలోగా పూర్తయ్యేలా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సీరియస్ గా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. తానే మళ్లీ వచ్చి కొబ్బరికాయ కొట్టి ఆస్పత్రిని ప్రారంభిస్తానని చెప్పారు. వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో నిర్మించే మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన చేసి.. సమీకృత కలెక్టరేట్, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం భవనాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వరంగల్ ఎంజీఎం, ప్రాంతీయ కంటి వైద్యశాల, సెంట్రల్ జైలు, మెడికల్ కాలేజీ కలిపి చూస్తే 200 ఎకరాలు అందుబాటులో ఉన్నట్లే. ప్రస్తుత ఎంజీఎం ఆస్పత్రి భవనాలు పాతబడినందున కూల్చివేసి భవనాలు నిర్మించాలి. దీనిని అత్యాధునికంగా మాతా, శిశు సంరక్షణ కేంద్రంగా మారుస్తాం. దానికి రెండు మూడు వేల కోట్లు ఖర్చయినా వెనుకాడం. వైద్య విభాగంలో ఉన్న అన్ని రకాల సేవలు హబ్ గా వరంగల్ లో అందుబాటులో ఉండేలా చేస్తాం. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ అతి పెద్దనగరం. ఇది గొప్ప విద్యా, వైద్య కేంద్రంగా మారాలి. వరంగల్ కు డెంటల్ కాలేజీ, డెంటల్ హాస్పిటల్ ను మంజూరు చేస్తున్నం. వరంగల్‌కు పెట్టుబడులు రావాలి. ఐటీ కంపెనీలను విస్తరించాలని అన్నారు. త్వరలోనే మామునూర్ ఎయిర్‌పోర్టు రాబోతోందన్నారు. చైనాలో 28 గంటల్లోనే 10 అంతస్తుల భవనం నిర్మించారు. ఆ తరహా నిర్మాణ పరిజ్ఞానం మనదగ్గర కూడా రావాలన్నారు.
హైదరాబాద్ లో జనాభా విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్రం మొత్తం హైదరాబాద్‌పై ఆధారపడితే జిల్లాలకు నష్టం కలుగుతుంది. జిల్లాలు కూడా అభివృద్ధి చెందితే హైదరాబాద్‌పై భారం తగ్గుతుందని అన్నారు. కరోనాపై ఊహాగానాలతో ప్రజలను భయపెట్టేలా వార్తలు ఇవ్వొద్దు. ఇది మంచిది కాదు. కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రసారం చేస్తే మంచిది. చాలా మంది భయాందోళనలతో మందులు, ఆక్సిజన్ సిలిండర్లు కొని పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు సామర్థ్యానికి మించి వస్తున్నారు. వచ్చిన రోగులను తిరిగి పంపించకుండా వీలున్న చోట పడుకోబెట్టి చికిత్స అందించాల్సి వస్తుంది అని అన్నారు. ప్రభుత్వ వైద్యులు, సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నా. వారు ఉత్తమ సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ వైద్యులపై దాడులు సరికాదని అన్నారు. లాక్ డౌన్ మరిన్ని రోజులు పెడితే ప్రజలకు ఉపాధి పోతుంది. అన్ని అంశాలను పరిశీలించాకే ఎత్తేశాం. ప్రస్తుతం కేసులు పెరగట్లేదు. థర్డ్ వేవ్ వస్తే గిస్తే అక్టోబర్ తర్వాతే వస్తుంది. ఈ మధ్య కాలంలో రాదు. తగిన జాగ్రత్తలు పాటిస్తే నియంత్రించొచ్చని అన్నారు.