Begin typing your search above and press return to search.

కరోనా వైరస్ కర్రీ , మాస్క్ రోటీ .. చూస్తే తినేవరకు రారు !

By:  Tupaki Desk   |   2 Aug 2020 2:30 AM GMT
కరోనా వైరస్ కర్రీ , మాస్క్ రోటీ .. చూస్తే తినేవరకు రారు !
X
కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం అతలాకుతలం అవుతుంది. రోజురోజుకి కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ మహమ్మారి పీడ వదిలేలా కనిపించడం లేదు. అయితే ఇటువంటి క్లిష్ట సమయంలో కూడా కొంతమంది తమ బుర్రకి పదునుపెట్టి .. కరోనాను క్యాష్ చేసుకుంటున్నారు. కరోనా వైరస్ ను పోలిన తినే పదార్థాలు తయారుచేసి అమ్మకానికి పెడుతున్నాయి. ఇటీవల ఓ బేకరీలో కరోనా వైరస్ ను పోలిన స్వీట్స్ అమ్మకానికి పెట్టడం తో ఆ పిక్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా రాజస్థాన్ జోధపూర్‌లో వేదిక మల్టీ-క్యూసిన్ రెస్టారెంట్... కొత్త ప్రయోగం చేసింది. ప్రజలు మాస్క్ ధరించాలనీ, కరోనా వైరస్‌తో అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ మాస్క్ నాన్‌ లు, కరోనా వైరస్ కర్రీలు తయారుచేస్తోంది.

వైరస్ ఆకారంలో కనిపించేలా కర్రీలను సెర్వ్ చేస్తోంది. ఈ కొత్త రకం కర్రీలను తినడానికి ప్రజలు ఎగబడుతున్నారు. మలాయ్ కోఫ్తా కర్రీ లను ఈ విధంగా తయారు చేస్తున్నారు. ఈ కర్రీలలోని కోఫ్తాలను కరోనా వైరస్ ఆకారంలో చేస్తున్నారు. నాన్ రోటీలను కరోనా మాస్క్ ‌లా కనిపించేలా చేస్తున్నారు. మీ ఆరోగ్యమే మాకు ముఖ్యం అంటున్న రెస్టారెంట్ యాజమాన్యం, అత్యంత పరిశుభ్రత, శానిటేషన్ చర్యలు తీసుకుంటున్నామనీ, మెనూ కూడా ముట్టుకోకుండానే డిసైడ్ చేయవచ్చని తెలిపారు. భౌతికదూరం తప్పనిసరిగా అమలుచేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఈ కరోనా కర్రీ, నాన్ మాస్క్ ఫొటోలో సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.