Begin typing your search above and press return to search.

ములాయం ప్ర‌శ్న‌ల‌తో అఖిలేష్ ఇర‌కున ప‌డ్డ‌ట్లే

By:  Tupaki Desk   |   12 May 2017 3:54 PM GMT
ములాయం ప్ర‌శ్న‌ల‌తో అఖిలేష్ ఇర‌కున ప‌డ్డ‌ట్లే
X
కుటుంబ పంచాయ‌తీలతో అధికారానికి - ప్ర‌జాద‌ర‌ణ‌కు దూర‌మైన‌ప్ప‌టికీ స‌మాజ్‌ వాదీ పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికీ తండ్రి-కొడుకులు-బాబాయి మ‌ధ్య విమ‌ర్శ‌లు కొసాగుతున్నాయి. తాజాగా ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్ల‌ ద్వారా త‌న కుమారుడిని ఇర‌కాటంలో ప‌డేశారు సమాజ్‌ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌. తన కొడుకు అఖిలేష్ యాదవ్‌ ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని ములాయం సింగ్ యాదవ్ కోరారు. అఖిలేష్ చెప్పిన మాట ప్ర‌కారమే తాను అడుగుతున్నాన‌ని ములాయం అన్నారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌రిగిన చ‌ర్చ‌ల్లో పార్టీ అధ్యక్ష పదవిని తీసుకునేటప్పుడు మూడు నెలల తర్వాత మళ్లీ తనకు తిరిగి అప్పగిస్తానని అఖిలేష్ చెప్పాడని ములాయం సింగ్ వెల్ల‌డించారు. కానీ ఇప్పుడు ప‌ద‌వి అప్ప‌గించ‌డం గురించి అఖిలేష్ ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. అధ్య‌క్ష స్థానంలో కూర్చోవాల‌నే ఆస‌క్తి త‌న‌కు ఏమీ లేద‌ని అయితే...అఖిలేష్ తన హామీని ఎందుకు నిలబెట్టుకోలేదనే త‌న ప్ర‌శ్న అని ములాయం వ్యాఖ్యానించారు. ఈ విష‌యంలో అఖిలేష్ తీరు గురించి ఆయ‌న్ను అడిగి తెలుసుకోవాల‌ని మీడియాకు ఉచిత స‌ల‌హా ఇచ్చారు.

కాగా,త‌న‌ను జాతీయాధ్యక్షుడిగా పేర్కొంటూ తమ్ముడు శివపాల్ యాదవ్ సమాజ్‌ వాదీ సెక్యులర్ మోర్చా అనే కొత్త పార్టీ ఏర్పాటు గురించి ములాయం ఈ సంద‌ర్బంగా లైట్ తీసుకున్నారు. కొత్త పార్టీ విషయం తనకు తెలియదని ములాయం తెలిపారు. త‌ద్వారా స‌మాజ్‌ వాదీ పార్టీకి మాత్ర‌మే నాయ‌క‌త్వం వ‌హిస్తాను అనే సందేశాన్ని పంపించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/