Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి ముఖేశ్ కుమార్తె అరెస్టు

By:  Tupaki Desk   |   2 Feb 2016 9:19 AM GMT
మాజీ మంత్రి ముఖేశ్ కుమార్తె అరెస్టు
X
బల్దియా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి... అక్కడక్కడా కొందరు నేతలు మాత్రం హల్ చల్ చేస్తున్నారు. దాంతో చిన్నచిన్న ఘటనలు తప్పడం లేదు. డబ్బులు పంపిణీ చేస్తున్నారనే అభియోగాలతో మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కుమార్తె శిల్పారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గౌన్‌ ఫౌండ్రీ ప్రాంతంలో కార్యకర్తలకు శిల్పారెడ్డి డబ్బులు పంచుతుండగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా టీఆరెస్ పొలిట్ బ్యూరో సభ్యుడు కేకే కుమార్తె కూడా హల్ చల్ చేస్తున్నారు. కేకే కుమార్తె విజయలక్ష్మి బంజారాహిల్స్ లో పోటీ చేస్తున్నారు. అక్కడ కొందరు ఓటర్లకు కార్డులున్నా వారిని ఓటేయకుండా మిగతాపార్టీలు అడ్డుకుంటున్నాయంటూ ఆమె ఆందోళన దిగారు. ఆందోలనను అడ్డుకున్న పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు.

సిటీలో పలు ఇతరచోట్లా చిన్నచిన్న వివాదాలు ఏర్పడ్డాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సోమాజిగూడ కాంగ్రెస్‌ అభ్యర్థి భర్త శ్రీనివాస్‌ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పార్టీ టోపీలు, కరపత్రాలతో పోలింగ్‌ కేంద్రానికి రావడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి గ్రేటర్ ఎన్నికల్లో మునుపటి వేడి మాత్రం కనిపించడం లేదు.. చాలావరకు ప్రశాంతంగానే ఉంటోంది. కొత్తతరం నేతలే కాస్త హడావుడి చేస్తున్నట్లుగా ఉంది కానీ పాతతరం నేతలు ప్రశాంతంగా పని కానిస్తున్నారు.