Begin typing your search above and press return to search.

మళ్లీ నంబర్​1కు దూసుకెళ్లిన అంబానీ..!

By:  Tupaki Desk   |   27 Feb 2021 6:11 AM GMT
మళ్లీ నంబర్​1కు దూసుకెళ్లిన అంబానీ..!
X
ముఖేశ్​ అంబానీ మళ్లీ ఆసియాలోనే నంబర్​ 1 కుబేరుడిగా అవతరించాడు. గత కొంతకాలం క్రితం చైనాకు చెందిన వ్యాపారి షంషన్ అంబానీని దాటి నంబర్​ 1 స్థానానికి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం షంషన్ ​కు భారీగా నష్టాలు రావడంతో మళ్లీ నంబర్​ 1 స్థానంలో అంబానీ నిలిచాడు. ప్రస్తుతం ముఖేశ్​ అంబానీ ఆస్తి 80 బిలియన్​ డాలర్లు.

చైనాకు చెందిన అలీబాబా గ్రూపు సంస్థల అధినేత జాక్​ మాను చాలా కాలం పాటు ఆసియా ఖండంలో ధనికుడిగా కొనసాగారు. అయితే రెండేళ్ల క్రితం అంబానీ అతడిని వెనక్కి నెట్టేశాడు. కానీ గత ఏడాది డిసెంబర్ ఫార్మా వ్యాపారి టైకూన్​ షంషన్​ అంబానీని కూడా దాటేశాడు. 98 బిలియన్​ డాలర్ల సంపదతో ఆసియాలోనే నంబర్​ 1గా నిలిచారు. ఫార్మా రంగంలో ఉన్న షంషన్​ కు .. బీజింగ్‌ వాంటాయి బయోలాజికల్‌ ఫార్మసీ ఎంటర్‌ ప్రైజ్‌ - నోన్ గ్‌ ఫూ బీవరేజ్‌ కంపెనీలు ఉన్నాయి.

అయితే కరోనా టైంలో వీటికి అనూహ్యంగా షేర్లు పెరగడంతో షంషన్​ దూసుకుపోయారు. ఆసియాలోనే నంబర్​ 1గా నిలవడమే కాక.. ప్రపంచంలో ఆరవ అత్యధిక సంపన్నుడిగా నిలిచారు.కానీ తాజాగా ఆయనకు 22 బిలియన్​ డాలర్ల నష్టం వచ్చింది. దీంతో షంషన్​ ఒక్కసారిగా వెనకబడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్తి 76.6 బిలియన్‌ డాలర్లు. అయితే అంబానీ ఆస్తి ఏమీ పెరగపోయినా.. షంషన్​ కు నష్టాలు రావడంతో అంబానీ టాప్ ​లోకి వెళ్లిపోయారు.