Begin typing your search above and press return to search.

అంబానీ మాస్టర్ స్కెచ్... టాప్ హోటల్ కొనుగోలు చేసిన రిలయన్స్ గ్రూప్

By:  Tupaki Desk   |   9 Jan 2022 9:30 AM GMT
అంబానీ మాస్టర్ స్కెచ్... టాప్ హోటల్ కొనుగోలు చేసిన రిలయన్స్ గ్రూప్
X
భారత్ లో అత్యంత ధనికులు ఒకరైనా ముకేశ్ అంబానీ తన వ్యాపారాలు మరింత విస్తరిస్తున్నారు. ఇప్పటికే ఆయిల్, టెలికాం లాంటి రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న రిలయన్స్.. త్వరలోనే హాస్పిటాలిటీ రంగంలో కూడా పూర్తి స్థాయిలో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే దేశంలో కొన్ని హోటల్, కన్వెన్షన్ పార్కులను కొనుగోలు చేసిన అంబానీ కుటుంబం ప్రస్తుతం విదేశాల్లో అత్యంత ఖరీదైన హోటళ్లను కొనుగోలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఆతిథ్య రంగానికి అధిక ప్రాముఖ్యతనిస్తూ ప్రపంచంలో టాప్ హోటళ్లలో పెట్టుబడి పెట్టి తాజాగా వాటిని సొంతం చేసుకుంటుంది.

ఇటీవల కాలంలో బ్రిటన్లో అత్యంత ఖరీదైన విలాసవంతమైన స్టోక్ పార్క్ ఎస్టేట్ నీ కొనుగోలు చేసిన రిలయన్స్ గ్రూప్ తాజాగా మరో హోటల్ ను సొంతం చేసుకుంది. అమెరికాలో అత్యంత ఖరీదైన హోటల్ లో ఒకటిగా పేరుగాంచిన మాండరిన్ ఓరియంటల్ అనే లగ్జరీ హోటల్ లో చేజిక్కించుకుంది. రిలయన్స్ గ్రూప్ కొనుగోలు చేసిన ఈ హోటల్ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిని బట్టి చూస్తే రిలయన్స్ గ్రూప్ త్వరలోనే హాస్పిటాలిటీ రంగంలో తనదైన మార్కు వేసేందుకు ప్రయత్నిస్తోందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ కు అధినేత ముఖేష్ అంబానీ చరిత్ర సృష్టిస్తారు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో న్యూయార్క్ ఒకటి . ఈ క్రమంలోనే రిలయన్స్ గ్రూప్ ఈ నగరంలో ఉండే 80 కొలంబస్ సర్కిల్ ప్రాంతంలో మాండరిన్ ఓరియెంటల్ హోటల్ ను కొనుగోలు చేసింది. దీనికి సుమారు 98 మిలియన్ డాలర్లను వెచ్చించి సొంతం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది న్యూయార్క్ నగరంలోనే లగ్జరీ హోటల్ గా ప్రసిద్ధికెక్కింది. దీనిని ఐకానిక్ హోటల్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఈ హోటల్ లో ఉన్నా ఈ ప్రాంతం క్యాపిటల్ ఆఫ్ కొలంబస్ కార్పొరేషన్ కిందకు వస్తుందని తెలుస్తోంది. అంబానీ పెట్టిన 90 మిలియన్ డాలర్లకు గాను హోటల్ లో సుమారు 78 శాతం వాటాను దక్కించుకున్నారు.

న్యూయార్క్ నగరంలో రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ కొనుగోలు చేసిన మాండరిన్ ఓరియంటల్ హోటల్ 2003లో స్థాపించారు. దీనికి చాలా విశిష్టతలు ఉన్నాయి. నగరంలో అత్యంత లగ్జరీ హోటల్ గా దీనికి పేరుంది. అంతే కాకుండా కొలంబస్ సర్కిల్ కు పక్కనే ఉండడం మరొక ప్లస్ పాయింట్ గా దీనికి ఉంది. వీటికి తోడు నేచురల్ సెంట్రల్ పార్క్ కూడా మాండరిన్ ఓరియంటల్ హోటల్ కు సమీపంలో ఉన్నాయి. ఈ హోటల్ ప్రపంచంలోనే అత్యంత సుప్రసిద్ధమైన హోటల్స్ లో ఒకటిగా పేరుగాంచింది. విదేశాల నుంచి వచ్చిన కుబేరులు ఎక్కువమంది ఈ హోటల్ లో విడిది చేస్తారు. ఈ హోటల్ ఇప్పటికే చాలా అవార్డులు కూడా వచ్చాయి.

ఫోర్బ్స్ ప్రకటించిన అత్యంత ఖరీదైన హోటల్స్ జాబితాలో మాండరిన్ ఓరియంటల్ ఒకటి. ఫోర్బ్స్ ఫైవ్‌స్టార్‌ స్పా అవార్డ్‌ను కూడా ఈ హోటల్ సొంతం చేసుకుంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం 2018లో ఈ హోటల్ విలువ సుమారు ఎనిమిది వందల యాభై కోట్లు ఉన్న ట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2020లో ఈ హోటల్ సుమారు వంద కోట్లకు పైగా ఆదాయాన్ని గడించిన ట్లు తెలుస్తోంది. ఇలాంటి అత్యంత ఖరీదైన హోటళ్లలో కొనుగోలు చేయడం ద్వారా తమ ఆస్తులను పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన వ్యాపార కార్యకలాపాల్లో హాస్పిటాలిటీ రంగానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.