Begin typing your search above and press return to search.
ఆసియా టాప్ టెన్ లో..ప్రపంచంలో టాప్ 50లో ‘అంబానీ’
By: Tupaki Desk | 24 July 2020 5:00 AM GMTవ్యాపార దిగ్గజాలు ఎవరైనా సరే.. తరచూ వార్తల్లో ఉండటం.. అది కూడా రికార్డుల్ని బ్రేక్ చేసిన నేపథ్యంలో కావటం చాలా అరుదుగా మాత్రమే సాగుతుంది. తాజాగా ఈ మేజిక్ ను వాస్తవరూపం దాల్చటంలోనూ రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సక్సెస్ అవుతున్నారు. తరచూ ఆయన రికార్డుల మీద రికార్డుల్ని సొంతం చేసుకుంటున్నారు. నిన్నటికి నిన్న ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో టాప్ ఫైవ్ లోకి చేరటం తెలిసిందే.
తాజాగా ఆయన మరో ఘనతను సాధించారు. ప్రపంచంలో అత్యంత విలువైన టాప్ 50 కంపెనీల్లో ఒకటిగా రిలయన్స్ అవతరించింది. స్టాక్ మార్కెట్ డేటా ప్రకారం రిలయన్స్ 48వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచంలో అత్యంత పెద్ద మార్కెట్ క్యాప్ ఉన్న సంస్థ సౌదీ ఆరామ్కో. దీని మార్కెట్ క్యాప్ 1.7 ట్రిలియన్ అమెరికా డాలర్లు. తర్వాతి స్థానంలో ఆపిల్.. మైక్రోసాఫ్ట్.. అమెజాన్.. ఆల్ఫాబెట్ లు ఉన్నాయి. గురువారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ రూ.2060.65 వద్ద ముగిసింది.
అంతకు ముందు క్లోజింగ్ డేటాతో పోలిస్తే.. 2.82 శాతం పెరిగింది. ప్రస్తుతం రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.13లక్షల కోట్లు. తాజాగా జారీ చేసిన రైట్స్ ఇష్యూతో కలుపుకుంటే ఇది కాస్తా రూ.13.5లక్షల కోట్ల మార్కెట్ ను టచ్ చేసినట్లైంది. ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఏమంటే.. ఇప్పటివరకూ మరే భారతీయ కంపెనీ కూడా ఇంత భారీ మార్కెట్ విలువను సొంతం చేసుకున్నది లేదు.
అంతదాకా ఎందుకు? మార్కెట్ తోపులుగా అభివర్ణించే యూనీ లీవర్.. బ్యాంక్ ఆఫ్ చైనా.. బీహెచ్ పీ గ్రూప్..రాయల్ డచ్ షెల్.. సాఫ్ట్ బ్యాంకుల పేర్లు విన్నారు కదా? ఈ కంపెనీలు కూడా సాధించలేనిది ముకేశ్ అంబానీ సాధించటం గమనార్హం. ఎందుకంటే.. పైన పేర్కొన్న కంపెనీల మార్కెట్ క్యాప్ అంటే రిలయన్స్ ఎక్కువ కావటం ఆసక్తికరం. ముకేశ్ సాధించింది ఎంత పెద్ద సక్సెస్ అన్నది మరోలా పోల్చి చెప్పాలంటే.. ఆసియాలో అతి పెద్ద మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీల జాబితాలో రిలయన్స్ టాప్ 10 స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా పోల్చినప్పుడు టాప్ 50లో ఉంది. చైనాకు చెందిన ఆలీబాబా గ్లోబల్ మార్కెట్ క్యాప్ లో ఏడో స్థానంలో ఉంది. రిలయన్స్ మినహా మరే భారత కంపెనీ టాప్ 50లో ఉన్నది లేదు.