Begin typing your search above and press return to search.

5జీ పై ముకేశ్ అంబానీ కీలక వ్యాఖ్య

By:  Tupaki Desk   |   9 Dec 2020 11:20 AM IST
5జీ పై ముకేశ్ అంబానీ కీలక వ్యాఖ్య
X
ఒకప్పుడు జనజీవితానికి ‘జీ’లతో సంబంధం ఉండేది కాదు. ప్రపంచమంతా డిజిటల్ వైపు పరుగులు తీస్తున్న వేళ.. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ఇప్పుడంతా ‘జీ’ల గురించి మాట్లాటం మామూలైపోయింది. ఆ మాటకు వస్తే.. వారి జీవితాల్లో ఇదో భాగంగా మారింది. ఒకప్పుడు 2జీ..3జీ.. అంటే చాలామందికి తెలిసేది కాదు. ఎప్పుడైతే రిలయన్స్ జియో వచ్చిందో..అప్పటినుంచి 2జీ.. 3జీ.. 4జీ తేడాలు తెలియటమే కాదు.. 5జీ ఎప్పుడెప్పుడు వస్తుందా? అన్న ఆసక్తి పెరిగింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ప్రభుత్వ విధానాల నేపథ్యంలో ఇప్పటికిప్పుడు 5జీని తీసుకొచ్చే సీన్ తమకు లేదని టెలికాం కంపెనీలు చెప్పాయి. అందుకు భిన్నంగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మాత్రంస్పష్టమైన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో భారత్ లో 5జీ సేవలు షురూ అవుతాయని.. ఆ విప్లవానికి తామే నాంది పలుకుతామన్న విషయాన్ని చెప్పేశారు.

ఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో పాల్గొన్న ఆయన భారత్ లో 5జీ విప్లవాన్ని తాము ప్రారంభిస్తామని.. వచ్చే ఏడాది ద్వితీయార్థానికి ఈ సేవల్ని ప్రారంభిస్తామనిపేర్కొన్నారు. అయితే.. 5జీ సేవల్ని ప్రారంభించాలంటే ప్రభుత్వ సాయం అవసరమన్నారు. కొన్ని విధానపరమైన చర్యలు అవసరమని.. వాటి విషయంలో ఆలస్యం చేయకుంటే త్వరగా 5జీని తీసుకురావొచ్చన్నారు. అయితే.. 5జీ సేవల కోసం పూర్తిగా స్వదేశీ సాంకేతికతనే తాము ఉపయోగిస్తామని చెప్పిన అంబానీ.. అందుకుఅవసరమైన నెట్ వర్క్.. హార్డ్ వేర్.. ఇతరసాంకేతిక పరికరాలను తమ కంపెనీనే డెవలప్ చేస్తుందని చెప్పటం గమనార్హం. 5జీ టెక్నాలజీలకు సంబంధించి చైనా కంపెనీలపై విమర్శలువెల్లువెత్తుతున్న వేళ.. అంబానీ నోట స్వదేశీ మాట రావటం గమనార్హం.