Begin typing your search above and press return to search.

ఏడాదిలో ముఖేష్ ఆస్తి అంత పెరిగిందట‌

By:  Tupaki Desk   |   5 Oct 2017 8:08 AM GMT
ఏడాదిలో ముఖేష్ ఆస్తి అంత పెరిగిందట‌
X
నిద్ర లేచింది మొద‌లు ప‌డుకునే వ‌ర‌కూ ఏదో ఒక స‌మ‌యంలో రిల‌య‌న్స్ వ‌స్తువులు వాడ‌కుండా ఉండ‌లేని ప‌రిస్థితి. అంత‌లా దేశ ప్ర‌జ‌లకు ద‌గ్గ‌రైంది రిల‌య‌న్స్ బ్రాండ్‌. దేశంలో అత్యంత సంప‌న్నుడిగా పేరొందిన ముఖేష్ అంబానీ తాజాగా మ‌రో రికార్డు నెల‌కొల్పారు. వ‌రుస‌గా ప‌దేళ్లుగా దేశంలో అత్యంత ధ‌న‌వంతుడిగా నిలిచారు. ఈ ఏడాదీ ఆయ‌న అగ్ర‌స్థానంలో నిలిచారు.

ప్లాస్టిక్ నుంచి పెట్రోలియం వ‌ర‌కూ.. తాజాగా టెలికం రంగంలోనూ సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న అంబానీ ఈ ఏడాదీ టాప్ లో నిలిచారు. ఫోర్బ్స్ తాజాగా ప్ర‌క‌టించిన జాబితాలో ముఖేష్ దాదాపు రూ.2.47ల‌క్ష‌ల కోట్ల సంప‌ద‌తో అగ్ర‌స్థానంలో నిలిచారు. గ‌తేడాదితో పోలిస్తే.. ముకేష్ త‌న నిక‌ర సంప‌ద‌ను 15.3 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పెంచుకున్నారు.

భార‌త్ లోనే కాక‌.. ఆసియాలోనూ టాప్ ఫైవ్ సంప‌న్నుల జాబితాలోనూ ముఖేష్ నిల‌వ‌టం ఒక విశేషం. రిఫైనింగ్ మార్జిన్ల‌ను పెంచుకోవ‌టంతో పాటు.. జియోతో టెలికాం వ్యాపారంలో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. 2016లో జియోను లాంఛ్ చేసిన ముఖేష్ స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే 130 మిలియ‌న్ వినియోగ‌దారుల్ని త‌న సొంతం చేసుకున్నారు. దీంతో.. రిల‌య‌న్స్ షేర్ల‌కు రెక్క‌లు వ‌చ్చాయి. దాంతో పాటు ముఖేష్ ఆస్తి విలువ కూడా పెరిగింద‌ని చెప్పాలి. ముఖేష్ తో పాటు.. మ‌రో భార‌త దిగ్గ‌జం కూడా త‌న స‌త్తా చాటారు. తాజాగా విప్రో అజిమ్ ప్రేమ్ జీ 19 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌లో భార‌తదేశ సంప‌న్నుల్లో రెండో స్థానంలో నిలిచారు.