Begin typing your search above and press return to search.
మహమ్మారి వణికే వేళలో టాప్ టెన్ కుబేరులు ఎవరంటే?
By: Tupaki Desk | 24 Jun 2020 8:30 AM GMTయావత్ ప్రపంచం వణికే పరిస్థితి. సామాన్యుడు మొదలు సెలబ్రిటీల వరకూ అందరూ ప్రభావితమయ్యేలా చేసిన మహమ్మారి వేళలోనూ ప్రపంచ కుబేరుల మీద పడిన ప్రభావం తక్కువేనని చెబుతున్నారు. మార్చిలో మొదలైన సంక్షోభం అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ.. దాని పడగ నీడ పడని ప్రముఖులు కొందరున్నారు. ఆ మాటకు వస్తే.. సంక్షోభాన్ని తమకో అవకాశంగా మలుచుకున్న వారు లేకపోలేదు.
మాయదారి రోగం దెబ్బకు ఆర్థికంగా కిందామీదా పడుతున్న వేళ.. అందుకు భిన్నంగా ఉన్నటాప్ టెన్ బిలియనీర్లఆస్తులు ఏ మేరకు ఉన్నాయి అన్నది ఆసక్తికరంగా మారింది. మే 31 నాటికి ప్రపంచంలోని కుబేరుల జాబితా విడుదలైంది. ఇందులో టాప్ వంద మంది ప్రముఖుల ప్రస్తావన ఉంది. అయితే.. టాప్ టెన్ లో భారత అపర కుబేరుడు ముకేశ్ అంబానీ చోటు దక్కించుకున్నాడు. గూగుల్ కంటే మిన్నగా అంబానీ నిలవటం ఆసక్తికరం.
ఇక.. ర్యాంకులు.. సదరు వ్యక్తుల సంపదనను చూస్తే.. ఎప్పటిలానే అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మొదటిస్థానంలో నిలిచారు. ఆయన సంపద 160 బిలియన్ డార్లుగా చెబుతున్నారు. రెండోస్థానంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ నిలిచారు. ఆయన సంపద వంద బిలియన్ డాలర్లుగా పేర్కొన్నారు. ఎల్ వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ అర్నాల్డ్ 89 బిలియన్ డాలర్లతో మూడోస్థానంలో నిలిస్తే.. బెర్క్ షైర్ హాత్ వే అధినేత వారెన్ బఫెట్ నాలుగో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఆయన సంపద 84 బిలియన్లుగా లెక్క కట్టారు.
ఐదో స్థానంలో ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకెర్ర బర్గ్ (84 బిలియన్ డాలర్లు) నిలిస్తే.. ఆరో స్థానంలో మైక్రోసాఫ్ట్ అధినేత స్టీవ్ బామర్ ఉన్నారు. ఆయన సంపద 68 బిలియన్ డాలర్లుగా లెక్క కట్టారు. ఏడో స్థానంలో ఇండిటెక్స్ అధినేత అమన్సియో ఒర్టెగా 67 బిలియన్ డాలర్ల సంపదతో నిలిచారు. ఎనిమిదో స్థానంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ నిలిచారు. ఆయన సంపద 66 బిలియన్ డాలర్లుగా తేల్చారు. ఇప్పుడు చెప్పినవన్నీ మే 31 నాటికి ఉన్న సంపద. ఇటీవల చేసుకున్న పలు ఒప్పందాలతో ముకేశ్ మరింత సంపదను క్రియేట్ చేశారన్న మాట వినిపిస్తోంది. తొమ్మిది పది స్థానాల్లో గూగుల్ ద్వయం సెర్గీ బ్రియాన్.. లారీ పేజ్ లు నిలిచారు.వీరి సంపద ఒక బిలియన్ తేడా ఉండటం గమనార్హం. సెర్గీ బ్రియాన్ 66 బిలియన్ డార్లు అయితే.. లారీ పేజ్ ది మాత్రం 65బిలియన్ డాలర్లుగా చెబుతున్నారు.
మహమ్మారి వేలలో ప్రపంచవ్యాప్తంగా పలువురు సంపన్నుల సంపదలో తరుగుదల చోటు చేసుకుంది. అయితే.. ముకేశ్ అంబానీ విషయంలో మాత్రం ఆయన తరుగుదల తక్కువగా నమోదైన వారిలో ముకేశ్ ఒకరు. ఇదిలా ఉంటేవ్యాక్సిన్ కింగ్ గా పేరున్న డాక్టర్ సైరస్ఎస్ పూనావాలాకు బాగా కలిసి వచ్చిందని చెబుతున్నారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ఆఫ్ ఇండియా ఛైర్మన్ కమ్ ఎండీ పూనావాలా ఆస్తి గడిచిననాలుగు నెలల్లో పోలిస్తే పాతిక శాతం పెరిగినట్లుగా గుర్తించారు. అందరి సంపద తరిగిపోతున్న వేళ.. ఇలాంటి వారు చాలా తక్కువగా ఉంటారన్న మాట విపిసి్తోంది.