Begin typing your search above and press return to search.
2 నెలల్లో అంబానీ అంత పోగొట్టుకున్నాడట!
By: Tupaki Desk | 7 April 2020 10:10 AM GMTకరోనా దెబ్బకు ప్రభావానికి గురి కానోడే కనిపించని పరిస్థితి. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకూ వారి స్థాయికి తగ్గట్లేగా కరోనా షాక్ తగిలింది. ఎంత చెట్టుకు అంత గాలి అన్న సామెతను కరోనా పక్కాగా పాటించిందని చెప్పాలి. ఈ వైరస్ పుణ్యమా అని.. ప్రపంచ కుబేరులకు సైతం వణుకు పుట్టే పరిస్థితి. ఎవరిదాకానో ఎందుకు? మొన్నటి వరకూ ప్రపంచ టాప్ టెన్ కుబేరుల్లో ఒకరుగా నిలిచిన రిలయన్స్ అధినేత అంబానీ పరిస్థితిని చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది.
కరోనా కారణంగా మార్చి 31 నాటికి ముకేశ్ ఆస్తి విలువ దగ్గర దగ్గర 28 శాతం హరించుకుపోయినట్లుగా హురూన్ నివేదిక వెల్లడించింది. కరోనా కారణంగా చోటు చేసుకున్న పరిణామాలతో తగ్గిన షేర్ విలువతో రోజుకు 300 మిలియన్ డాలర్ల మేర తగ్గినట్లు అంచనా వేసింది. ఫిబ్రవరి - మార్చి మధ్య ముకేశ్ సంపద ఏకంగా రూ.1.40లక్షల కోట్లు హరించుకుపోయినట్లు వెల్లడించింది.
ఈ కారణంతో ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన స్థానం తగ్గింది. ప్రస్తుతం ఆయన 17వ స్థానంలో నిలిచినట్లు పేర్కొంది. అంబానీ తర్వాత ఎక్కువ సంపద పోగొట్టుకున్న ఇతర భారతీయుల్లో గౌతమ్ అదానీ ఉన్నారు. ఆయన సంపద ఆరు బిలియన్ డాలర్లు తగ్గినట్లుగా లెక్క కట్టారు. హెచ్ సీఎల్ టెక్ శివ నాడార్ ఆస్తి విలువ ఐదు మిలియన్ డాలర్లు.. ఉదయ్ కోటక్ ఆస్తి విలువ నాలుగు బిలియన్ డాలర్ల మేర తగ్గినట్లుగా అంచనా వేశారు. ఇదంతా చూసినప్పుడు సామాన్యుడికే కాదు.. అపర కుబేరులకు కూడా భారీ షాక్ తగిలినట్లే.