Begin typing your search above and press return to search.

మనవరాలికోసం... అంబానీ చేసిన పనిఅదుర్స్!

By:  Tupaki Desk   |   5 Jun 2023 2:38 PM GMT
మనవరాలికోసం... అంబానీ చేసిన పనిఅదుర్స్!
X
ఆడపిల్ల అంటే అందరికీ ఇష్టమే. ఇంటిలో ఆడపిల్ల పుట్టిందంటే లక్ష్మీ దేవి పుట్టిందని భావిస్తుంటారు. కూతురు పుడితే తల్లితండ్రులు ఎంత సంబరపడతారో... మనవరాలు పుట్టిందని తెలిస్తే నానమ్మ తాతయ్యలు మరింత సంబరపడిపోతుంటారు. ఆడా మగా అనే వ్యతాసాలు ఉన్నా, పోయినా... ఆడపిల్లకు ఇంటిలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటూనే ఉంటుంది. అయితే తాజాగా ఒక మనవారాలికి తాత అయిన అంబానీ.. తన మనవరాలికోసం చేసిన ఒక విషయం హాట్ టాపిక్ గా మారింది.

అసలు కంటే వడ్డీ ముద్దని సామెత... మనవలూ మనవరాళ్ల విషయంలో అప్పటివరకూ తమ పిల్లలపై ఉన్న ప్రేమను రెట్టింపుచేసి ఇస్తుంటారు తాతలు - అమ్మమ్మలు - నానమ్మలు. ఇక మనవరాలు పుట్టిందంటే ఆ తాత సంబరాలు అంబరాన్నంటుతాయి. ఇక అంబానీ లాంటి బిలియనీర్ కి ముద్దుల మనవరాలు పుడితే.. సంబరాలు, హడావిడీ ఏస్థాయిలో ఉంటుందో చెప్పనవసరం లేదు. తాజాగా ఆయన కూడా "అంతకు మించి" అన్నట్లుగానే సంబరాలు చేశారు.

వివరాల్లోకి వెళ్తే... ముఖేశ్‌ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతా గత వారం ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమెను ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో ఏకంగా మనవరాలు బుల్లి ప్రిన్సెస్‌ కోసం భారీ కాన్వాయ్‌ నే ఏర్పాటు చేశారు ముఖేశ్ అంబానీ. అవును... సర్ హెచ్‌.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ నుంచి లగ్జరీ కార్లతో కూడిన భారీ కార్ కాన్వాయ్‌ తో పాపాయిని ఇంటికి ఆహ్వానించి సంబరాలు చేసుకున్నారు ముఖేశ్‌.

దిగ్గజ పారిశ్రామికవేత్త మనవరాలు భారీ భద్రత మధ్య, దేశీయ, విదేశీ లగ్జరీ కార్లు కాన్వాయ్‌ తో ఇంటికి చేరింది. అయ్తిఏ... సుమారు 50 కోట్లకు పైగా విలువైన 20కి పైగా కార్లు ఈ కాన్వాయ్ లో ఉన్నాయని తెలుస్తుంది. రోల్స్ రాయిస్ కల్లినన్ శూవ్, లంబోర్ఘిని ఉరస్, మెర్సిడెస్-ఏఎంజీ జి63, ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, మెర్సిడెస్-మేబ్యాక్ ఎస్ 580 లాంటి సూపర్‌ లగ్జరీ కార్లతో భారీ కాన్వాయ్‌ ముంబై వీధుల్లో సందడి చేసింది. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో వైరల్ గా మారింది.

అయితే తాజాగా ముఖేశ్ అంబానీ ఫ్యామిలీలోకి ఈ పాపాయి రావడంతో ముఖేశ్‌, నీతా అంబానీ తరువాతి వారసుల సంఖ్య నాలుగుకి చేరింది. కుమార్తె ఇషా, ఆనంద్‌ పిరామల్‌ దంపతులకు ట్విన్స్‌ కృష్ణ, ఆదియా ఉన్న సంగతి తెలిసిందే!