Begin typing your search above and press return to search.

ఏజీఎం వేళ ముకేశ్ అంబానీ భారీ డీల్.. రూ.11లక్షల కోట్లతో ఎవరితోనంటే?

By:  Tupaki Desk   |   21 Jun 2021 3:14 AM GMT
ఏజీఎం వేళ ముకేశ్ అంబానీ భారీ డీల్.. రూ.11లక్షల కోట్లతో ఎవరితోనంటే?
X
దేశంలో కంపెనీలకు కొదవ లేదు. ఎన్ని కంపెనీలు ఉన్నప్పటికీ.. రిలయన్స్ కు మిగిలిన వాటికి మధ్య ఒక వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ప్రతి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తన వార్షిక వాటాదారుల మీటింగ్ ను నిర్వహిస్తుంటారు. కానీ.. తూతూ మంత్రంగా. కానీ.. రిలయన్స్ అలా కాదు. తన కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారిని ఏజీఎంకు పిలిచి.. వారి సమక్షంలో సమావేశాన్నినిర్వహిస్తుంటారు. మిగిలిన కంపెనీలకు పూర్తి భిన్నంగా సాగే ఈ సమావేశంలో కీలక అంశాల్ని ప్రకటించటం ముకేశ్ అంబానీకి అలవాటే.

ఇదిలా ఉంటే.. తాజా ఏజీఎం ఈ నెల 24న నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అనూహ్యమైన రీతిలో ఒక భారీ వ్యాపార ఒప్పందాన్ని ముకేశ్ అంబానీ చేసుకోనున్నట్లు చెబుతున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో ఇటీవల కాలంలో ఇంత భారీ డీల్ చోటు చేసుకోవటం చాలా తక్కువని చెబుతుననారు. ఈ సమావేశంలోనే అతి తక్కువ ధరకే 5జీ ఫోన్ ను లాంచ్ చేయనున్నట్లు చెబుతున్నారు.

అంతేకాదు.. ఒక భారీ ఒప్పందం కూడా జరుగుతుందని తెలుస్తోంది. సౌదీకి చెందిన అరాంకో కంపెనీతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భారీ ఒప్పందాన్ని చేసుకుంటారని చెబుతున్నారు. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఇది ఏకంగా 15 బిలియన్ డాలర్లుగా చెబుతున్నారు. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.11 లక్షల కోట్లు. అంటే.. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి బడ్జెక్ కు దాదాపు నాలుగు రెట్లు ఎక్కవని చెప్పాలి. ఈ సమావేశంలో ఆరాంకో ఛైర్మన్.. కింగ్డ్ ఆఫ్ వెల్త్ ఫండ్ పబ్లిక్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ గవర్నర్ యాసిర్ అల్ రుమయ్యన్ కూడా పాల్గొంటారని చెబుతున్నారు. ఈ డీల్ మార్కెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతుందన్న మాట వినిపిస్తోంది.