Begin typing your search above and press return to search.
29-06-2016 మధ్యాహ్నం 2.59లకు ఏమవుతుంది?
By: Tupaki Desk | 28 Jun 2016 6:35 AM GMTఇలా డేట్ చెప్పి.. టైమ్ ఇవ్వాల్సినంత పెద్ద విషయమా? అంత ప్రత్యేకత ఏమిటో? లాంటి ప్రశ్నలు చాలామందికి రావొచ్చు. నిజానికి.. ఇంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందా? అని మొత్తం చదివిన తర్వాత కొందరు ఫీల్ కావొచ్చు. కానీ.. చరిత్రలో నమోదయ్యే ఒక తేదీకి.. భవిష్యత్ పోటీ పరీక్షల్లో ప్రశ్నగా మారే అవకాశం ఉన్న సందర్భానికి ఆ మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుంటే ఎలా? ఇంతకీ.. ఆ రోజు ఏమవుతుందంటారా? అక్కడికే వస్తున్నాం.
విభజన నేపథ్యంలో.. హైదరాబాద్ నుంచి ఏపీకి ఆంధ్రప్రదేశ్ సచివాలయం తరలివెళ్లటం ఇప్పటికే మొదలైంది. అయితే.. ఏపీలో నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో ఏపీ సచివాలయం గృహప్రవేశ కార్యక్రమం ఈ నెల29న మధ్యాహ్నం 2.59 గంటలకు డిసైడ్ చేశారు. ఇక.. హైదరాబాద్ లోని ఏపీ సచివాలయాన్ని అమరావతికి షిఫ్ట్ చేసే కార్యక్రమాన్ని నాలుగు దశల్లో చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలిదశను ఈ నెల 29న అంటే.. రేపు (బుధవారం) మధ్యాహ్నం 2.59 గంటలకు ఏపీ సచివాలయంలోకి హైదరాబాద్ నుంచి వచ్చిన సచివాలయ ఉద్యోగులు అడుగు పెట్టనున్నారు.
ఇక.. నాలుగుదశల్లో సాగే తరలింపుకార్యక్రమంలో తొలిదశలో వైద్య ఆరోగ్య శాఖ.. కార్మిక శాఖ.. గృహనిర్మాణ శాఖ.. పంచాయితీరాజ్ శాఖలు తరలి వెళ్లనున్నాయి. 29న మొదలయ్యే గృహప్రవేశ కార్యక్రమం.. వరుసగా దశల వారీగా సాగుతూ జులై 21 వరకూ కొనసాగనుంది. అంటే.. వచ్చే నెల 21 తర్వాత హైదరాబాద్ లోనిఏపీ సచివాలయంలో స్కెలిటన్ స్టాఫ్ మాత్రమే ఉంటారు. ఎందుకిలా అంటే.. ఏపీ సచివాలయం మొత్తం వెళ్లి పోయిన తర్వాత.. హైదరాబాద్ లోనే ఉండే హైకోర్టుకు సంబంధించిన న్యాయపరమైన కార్యకలాపాల్ని ఈ స్కెలిటన్ స్టాఫ్ పర్యవేక్షించనున్నారు.