Begin typing your search above and press return to search.

సొంత కొడుకును ప‌ట్టించుకోని మొహ్మ‌ద్ అలీ

By:  Tupaki Desk   |   5 Jun 2016 3:41 PM GMT
సొంత కొడుకును ప‌ట్టించుకోని మొహ్మ‌ద్ అలీ
X
బాక్సింగ్ దిగ్గజం మొహ్మద్ అలీ మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న జీవితానికి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌ విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. భారీ ఫ్యామిలీని క‌లిగి ఉన్న మొహ్మ‌ద్ అలీ త‌న సొంత కొడుకు జీవితం గురించి ప‌ట్టించుకోలేదు. ఆయ‌న కొడుకు జూనియ‌ర్ అలీ ఈ ప‌రిణామంతో షాక్ తిని త‌న తండ్రి గురించిన ప్ర‌స్తావ‌న అవ‌స‌రం లేదంటూ తేల్చేసి ప్ర‌స్తుతం క‌ష్టాలు ప‌డుతున్నాడు. తాజాగా ఆయ‌న జీవితం వెలుగులోకి వ‌చ్చింది. మొహ్మ‌ద్ అలీకి నలుగురు భార్యలు. తొమ్మిది మంది పిల్లలు. అందులో మొదటి భార్య కొడుకే జూనియర్ అలీ. సోన్జీ రాయ్ - బెలిండా బాయ్డ్ - వెరొనియా పోర్ష్‌ ల కంటే ముందు భార్య సంతాన‌మే జూనియ‌ర్ అలీ.

దాదాపు రెండు సంవత్సరాలుగా మొహహ్మ‌ద్ అలీకి దూరంగా ఉంటున్న జూనియర్ ఆలీ కొద్దికాలం క్రితం ఒక మీడియా సంస్థ‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు. తండ్రి గురించి ఆలోచించడం మానేశానని, ఆయనకు ఏం జరిగినా తనకు అనవసరమని ఆ సంద‌ర్భంగా తేల్చిచెప్పాడు. అప్ప‌టినుంచి అలీ చ‌నిపోయే వ‌ర‌కు సైతం జూనియ‌ర్ ఆయ‌న్ను క‌ల‌వ‌క‌పోవ‌డం ఆస‌క్తిక‌రం. ప్రస్తుతం చికాగాలో ఒక స్వచ్ఛంద సంస్థ అందించే సహకారంతో భార్య షకీరా - పిల్లలు అమీరా(8) - షకీరా(7)తో క‌లిసి జీవిస్తున్నాడు. తల్లి తరపు తాతయ్య దగ్గర కుటుంబంతో క‌లిసి ఉంటూ దుర్బ‌ర ప‌రిస్థితిని అనుభ‌విస్తున్నాడు. ఇదిలాఉండ‌గా మొహ‌మ్మ‌ద్ అలీ మూడోభార్య పిల్లలైన లైలా అలీ - హనా అలీని జూనియ‌ర్ అలీ త‌ర‌చూ క‌లుస్తుంటాడు. కానీ వారిద్ద‌రితో మంచి సంబంధం ఉన్న అలీని మాత్రం క‌ల‌వ‌క‌పోవ‌డం ఆస‌క్తిక‌రం. ప్రపంచంలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన మొహ్మ‌ద్ అలీ కుమారుడు ఒక అనామకుడిలా మిగిలిపోవడం విచారకరం అని కొంద‌రు వ్యాఖ్యానిస్తుండ‌గా... అంద‌రి అభిమానాలు పొందిన వ్య‌క్తి విలువ ఏమిటో సొంత కొడుకు జూనియర్ అలీ గుర్తించలేకపోయాడని మ‌రికొంద‌రు వివ‌రిస్తున్నారు.