Begin typing your search above and press return to search.

బాబుకు ఒక్క ఓటు పడకుండా ముద్రగడ స్కెచ్

By:  Tupaki Desk   |   18 Jun 2018 6:08 AM GMT
బాబుకు ఒక్క ఓటు పడకుండా ముద్రగడ స్కెచ్
X
రాజకీయాల్లో సాంతం వాడేసుకొని వదిలేయడమెలాగో చంద్రబాబుకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదేమో.. ఆయన చరిత్రను పరికించి చూస్తే ఇప్పుడు అదే కనపడుతోంది. నాడు పిల్లనిచ్చిన మామను గద్దెదించి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాడు.. నేడు ఎన్నికల వేళ బీజేపీ తో బంధాన్ని తెంచుకొని మొసలి కన్నీరు కారుస్తున్నారు. 2014 ఎన్నికల్లో గెలవడం కోసం కాపులపై వరాల వాన కురిపించారు. ఇప్పుడేమో వారికి మొండిచేయి చూపి నట్టేట ముంచారు. కాపులకు అన్యాయం చేసిన చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకునేందుకు కాపు ఉద్యమ నేత రెడీ అయ్యారు. ఈ మేరకు ఆయన చంద్రబాబు చరిత్రను తవ్వితీస్తూ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్దిచెప్పేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు.. ఈ సందర్భంగా చంద్రబాబు గురించి పలు సంచలన ఆరోపణలు చేశారు.

తాజాగా ముద్రగడ తన కార్యాచరణను ప్రకటించారు. ముఖ్యమంత్రికి సంబంధించిన సామాజికవర్గం ఎలాగైతే ఒకటిగా ఉంటూ.. అనాదిగా టీడీపీకి సపోర్ట్ గా నిలుస్తున్నారో.. ఎన్నికల సమయానికి టీడీపీకి గంపగుంతగా ఓట్లు వేస్తున్నారో అలానే కాపు జాతి కూడా ఏకం కావాలని ముద్రగడ పిలుపునిచ్చారు. కాపులను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పేలా తమ కార్యాచరణ ఉండబోతోందని ముద్రగడ తెలిపారు.

మోసం మీద మోసం.. దగా మీద దగా చేసి నాలుగేళ్ల పాటు చంద్రబాబు నాయుడు కాలక్షేపం చేశారని ముద్రగడ ఆరోపించారు. భాజాపాతో సంబంధాలు బాగున్నంతకాలం కాపు జాతికి ఇచ్చిన హామీ అమలు చేయాలన్న ఆలోచనే రాలేదన్నారు. బీజేపీతో సంబంధాలు చెడాక ఇప్పుడు ఆమోదించి పంపి బాబు మోసం చేశాడని విమర్శించారు. తమ జాతిని బాబు దగా చేస్తున్నాడని ముద్రగడ మండిపడ్డారు. 2019లో కాపుల ఆగ్రహాన్ని ముఖ్యమంత్రి చవి చూస్తారని ముద్రగడ హెచ్చరించారు.